Begin typing your search above and press return to search.

ఏపీలో 7వేల ఉద్యోగాలు కట్!

By:  Tupaki Desk   |   25 Jun 2020 6:15 AM GMT
ఏపీలో 7వేల ఉద్యోగాలు కట్!
X
ఏపీ సీఎం జగన్ వచ్చాక ఆర్టీసీ కార్మికులను కడుపున పెట్టుకున్నారు.. ఏకంగా ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులను చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికుల దృష్టిలో సీఎం జగన్ దేవుడయ్యాడు. ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. జగన్ వచ్చాక కార్మిక, ఉద్యోగ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందరికీ వరాలు ఇచ్చే ఈ దేవుడు తాజాగా 7వేల మంది ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు రోడ్డున పడేశాడన్నది ఇప్పుడు అందరినీ కలవర పరుస్తున్న ప్రశ్న..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులు కదల్లేదు. ఆర్టీసీ భారీ సంక్షోభంలో చిక్కుకుంది. పనిలేదు.. వేతనాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క ఆదేశంతో ఏకంగా 7వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్టు తెలిసింది.

గత నెలలోనే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి విమర్శలు రావడంతో ఏపీఎస్ ఆర్టీసీ వెనక్కితగ్గింది. తాజాగా ఆర్టీసీ మళ్లీ ఇదే నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారంతో వారందరినీ తొలగిస్తున్నట్టు తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇవాళ్లి నుంచి విధుల్లోకి రావద్దని 7000 మందికి సమాచరమిచ్చింది.

కాగా ఈ 7వేల మంది స్థానంలో ఖాళీగా ఉన్న కండక్టర్ల సేవలను వినియోగించుకోవాలని సంస్థ నిర్ణయించింది.

సీఎం జగన్.. ఈ రోడ్డున పడ్డ 6వేల మంది విషయంలో మానవతా దృక్ఫథంతో స్పందించాల్సిన అవసరం ఉందని వారంతా కోరుతున్నారు. అప్పుడే వైసీపీ ప్రభుత్వానికి ఈ కలంకం తప్పుతుందంటున్నారు