Begin typing your search above and press return to search.
అల్ట్రా డీలక్స్ పేరుతో ఏపీ ఆర్టీసీ భలే వాయింపు
By: Tupaki Desk | 4 April 2016 6:54 AM GMTఆదాయాన్ని పెంచుకోవటానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేనట్లుగా ఉంది ఏపీ ఆర్టీసీ తీరు చూస్తుంటే. ఛార్జీలు పెంచితే ప్రజల్లో ఆగ్రహం వచ్చే అవకాశం ఉండటంతో.. తన మెదడుకు మేత పెట్టి.. కొత్త తెలివితేటలతో వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజాగా కొత్త బస్సుల్ని తెర మీదకు తీసుకొచచి.. 10 శాతం ఛార్జీల్ని బాదేయటం చూసిన వారికి నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఇప్పటివరకూ డీలక్స్ బస్సులుగా నడుపుతున్న బస్సులకు చిన్నపాటి మార్పులు చేసేసి.. కొత్త రంగు.. సరికొత్త పేరు పెట్టేసి ఛార్జీల బాదుడును షురూ చేసేసింది. మామూలుగా అయితే డీలక్స్ బస్సుల్లో సీట్లు వెనక్కి వెళ్లవు. కానీ.. తాజాగా తెరపైకి తీసుకొచ్చిన ‘‘అల్ట్రా డీలక్స్’’ బస్సుల్లో నాలుగు అంగుళాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
ఈ తరహా బస్సుల్ని ఇప్పటికే తన దగ్గర ఉన్న 650 డీలక్స్ బస్సులలో 200 బస్సులకు కొత్త మార్పులు చేసేసి.. 10 శాతం ఛార్జీ బాదుడు వేసేసింది. తాజా పెంపు ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంటే.. ప్రయాణికుడి జేబుకు మాత్రం చిల్లు పడనుంది. కొత్త రంగేసి.. సీట్లను కాస్త మార్చేసి పది శాతం ఛార్జీల్ని పెంచేసే ఆర్టీసీ ఐడియాను చూసినోళ్ల నోట మాట రాని పరిస్థితి.