Begin typing your search above and press return to search.

అలా చేస్తే వ్య‌భిచారం నేరం కాద‌ట‌

By:  Tupaki Desk   |   7 May 2017 5:24 AM GMT
అలా చేస్తే వ్య‌భిచారం నేరం కాద‌ట‌
X
వ్య‌భిచారం - సెక్స్ వ‌ర్క‌ర్ల విష‌యంలో గుజరాత్ హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. సెక్స్‌ వర్కర్లు తమ ఇష్టపూర్వకంగా పడుపువృత్తిని నిర్వహిస్తే - అందుకు ఏ ప్రేరేపిత శక్తి, బలత్కారం కారణం కాకుంటే వారి వ్యభిచారాన్ని నేరంగా పరిగణించలేం అని గుజరాత్ హైకోర్టు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 370 నిబంధన బానిసత్వం-భౌతిక-లైంగికదాడిని సూచిస్తుందని అర్థంచేసుకోవాలని కోర్టు పేర్కొంది. వ్యభిచారానికి సంబంధించినంత వరకు సెక్స్‌ వర్కర్‌ కు - కస్టమర్‌ కు కూడా ఈ సెక్షన్‌ లో అపరాధి అనే నిర్వచనం ఉన్నదని కోర్టు వెల్లడించింది.

జనవరి మూడున సూరత్‌ లోని ఒక వ్యభిచార గృహానికి వెళ్లిన వినోద్ పటేల్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ ను ధర్మాసనం విచారించింది. వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులతోపాటు వినోద్‌ పటేల్‌ ను కూడా అరెస్టుచేశారు. అనైతిక వ్యాపార (నిరోధక) చట్టంతోపాటు ఐపీసీలోని 370 సెక్షన్ కింద అతడిపై కేసు నమోదుచేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ వ్యభిచార కంపెనీని నడుపడం లేదని, తాను సెక్స్‌ వర్కర్‌ తో ఉండగా పట్టుబడలేదని, అక్కడుండగా పోలీసులు అరెస్టుచేశారని కోర్టుకు వివరించారు. పటేల్‌ పై మోపిన అభియోగాలను హైకోర్టు రద్దు చేసినా ఐపీసీలోని 370 సెక్షన్ కింద దాఖలైన అభియోగాలను తొలిగించడానికి నిరాకరించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/