Begin typing your search above and press return to search.
మగవాళ్లకు కూడా దిశ చట్టాన్ని వర్తింపజేయండి ...హత్యకి గురైన బాధితుడి తండ్రి డిమాండ్ !
By: Tupaki Desk | 28 Dec 2020 4:00 PM ISTరోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఏపీ సర్కార్ దిశా చట్టాన్ని తీసుకువచ్చింది . మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ దిశా చట్టం కేవలం మహిళల కోసమే. అయితే , తాజాగా ఈ దిశా చట్టాన్ని మహిళలకే కాదు, మగవారికి కూడా అమలు చేయాలనే ఓ డిమాండ్ తెరపైకి వచ్చింది. మగవారికి కూడా దిశా చట్టం అమలు చేయాలని ఎవరు , ఎందుకు కోరారు అనే విషయాన్ని చూస్తే ...
గత రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాల ఆళ్లగడ్డలో మొఘల్ గఫార్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకి కారణం గఫార్ కు కాబోయే భార్య కు ఉన్న లవ్ ఎఫైరే అని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ యువతి ఫోన్ నెంబర్ కాల్ డాటా పరిశీలించగా హత్య జరిగిన తర్వాత శేఖర్ అనే యువకుడు యువతికి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే శేఖర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గఫార్ కు కాబోయే భార్యతో శేఖర్ కి ప్రేమాయణం నడుస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం పెట్టిన దిశ చట్టాన్ని మగవాళ్లకు కూడా వర్తింప చేయాలని గఫార్ సోదరుడు, తండ్రి డిమాండ్ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఇంటికి రమ్మని పిలిపించుకొని ప్రియుడితో కలిసి హత్య చేయించిన యువతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని వారు పోలీసులను ప్రశ్నించారు. ఇలాగే పెళ్లి నిశ్చయమైన తర్వాత యువతిని హత్యచేసి ఉంటే దిశ చట్టం కింద శిక్షించే వారే కదా ఇప్పడు కూడా అదే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గఫార్ కు శత్రువులు లేరని, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.