Begin typing your search above and press return to search.

యాపిల్ సంస్థ సరికొత్త రికార్డు..!

By:  Tupaki Desk   |   4 Jan 2022 7:34 AM GMT
యాపిల్ సంస్థ సరికొత్త రికార్డు..!
X
ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో యాపిల్ రికార్డు సృష్టించింది. అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించింది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కలను సోమవారం ట్రేడింగ్ సెషన్లో సహకారం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని కంపెనీల కంటే తన మార్కెట్ వ్యాల్యూ ని అమాంతం పెంచుకుంది. ప్రపంచ షేర్ మార్కెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ హై సాధించిన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మరే ఇతర కంపెనీకి సాధ్యం కాని మూడు ట్రిలియన్ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీగా యాపిల్ అవతరించింది. అంటే ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ నికర విలువ ఏకంగా భారత కరెన్సీ ప్రకారం 75 లక్షల కోట్ల రూపాయల విలువను కలిగి ఉన్న సంస్థగా పేరుగాంచింది.

సోమవారం జరిగిన ట్రేడింగ్ సెషన్లలో యాపిల్ కంపెనీ మార్కెటింగ్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల ను దాటినట్లు ఆ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి కంపెనీ ఇదే కావడం విశేషం. వివిధ దేశాల్లో ఇప్పటికే కొన్ని వేలకు పైగా ఆఫీసులో ను కలిగిన ఈ మల్టీ నేషనల్ కంపెనీ తొలిసారి ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సంస్థ షేర్ మార్కెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి యాపిల్ షేర్లు సుమారు ఐదు వేల పద్దెనిమిది వందల కోట్లకు పైగా పెరిగినట్లు సంస్థ పేర్కొంది. అంటే పెట్టుబడిగా పెట్టినా రూపాయికి సుమారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చినట్లు. యాపిల్ సృష్టికర్త అయిన స్టీవ్ జాబ్స్ 2017 లో సంస్థ నుంచి తొలి ఫోను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో కూడా యాపిల్ షేర్లు భారీగా పెరిగాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన నాటి నుంచి ఈ సంస్థ మరింత భారీగా పెరిగాయి. కంపెనీ చెప్పిన దాని ప్రకారం 200 శాతానికి పైగా సంస్థ షేర్లు వృద్ధి చెందాయి. ఇప్పుడు ఏకంగా మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ను సొంతం చేసుకున్న కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది.

ఆపిల్ కంపెనీ తొలిసారిగా 1976లో స్థాపించారు. అప్పుడు ఈ సంస్థ కేవలం ఒక కంప్యూటర్ కంపెనీ గా మాత్రమే ఉండేది. తర్వాత జరిగిన పరిణామాలలో భాగంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాంటి ఇతర సర్వీసులను కూడా అందించడం ప్రారంభించింది. తర్వాత కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీ యాపిల్ ఫోన్ తీసుకు వచ్చింది. ఇది ప్రపంచ స్మార్ట్ఫోన్ చరిత్రలో సంచలనంగా మారింది. భద్రతతోపాటు హోదా కు సంబంధించినదిగా యాపిల్ ఫోన్ ప్రజలు కొనడం ప్రారంభించారు . దీంతో సంస్థ లాభాలు భారీగా పెరిగాయి. అయితే రెండు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ ని అందుకున్న 17 నెలల కొత్త రికార్డు యాపిల్ కంపెనీ సొంతం చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి

ప్రపంచ మార్కెట్ వ్యాల్యూ జాబితాలో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో ఆల్ఫాబెట్ లు ఉన్నాయి.