Begin typing your search above and press return to search.
ఐఫోన్ 12.. ఇండియాలో రేటు ఎంతో చెప్పేశారు
By: Tupaki Desk | 15 Oct 2020 11:45 AM ISTప్రపంచ వ్యాప్తంగా టెక్ ప్రియులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్12 సిరీస్ ఫోన్లు అధికారికంగా లాంఛ్ అయ్యాయి. ఈ ఫోన్ల గురించి సోషల్ మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. భారీ బజ్ మధ్య రిలీజ్ అయిన ఈ ఫోన్లు త్వరలో వినియోగదారుల చేతికి చేరనున్నాయి. యాపిల్ కు ఇండియా అంటే ఇప్పటికి చిన్నచూపేనా? భారత్ తమకు మంచి మార్కెట్ అని చెబుతున్నా.. తాజా సిరీస్ ఫోన్లు భారతీయుల చేతికి రావటానికి మరో రెండు వారాలకు పైనే సమయం పట్టనుంది. దీంతో దసరా పండక్కి కొత్త ఐఫోన్ 12 కొనేద్దామని అనుకున్నోళ్లకు నిరాశ తప్పనట్లే.
ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన 12 సిరీస్ లోని నాలుగు ఫోన్ల ధరలు ఎక్కడ నుంచి షురూ అవుతాయి? అన్నది ప్రశ్న. ఇప్పటికే యూఎస్ లోని రేట్లను ప్రకటించినా.. భారత్ లో వీటి ధరను ఎంతకు నిర్ణయిస్తారన్న ఉత్కంట ఉంది.తాజాగా ధరల విషయంలో యాపిల్ క్లారిటీ ఇచ్చింది. ఐఫోన్ 12 మినీ.. ఐఫోన్ 12.. ఐఫోన్ 12 ప్రొ.. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ వేరియంట్లలో విడుదలయ్యే ఈ ఫోన్లు.. గతం కంటే స్లిమ్ గా స్లీక్ గా తీసుకురావటం తెలిసిందే.
ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 12 సిరీస్ రూ.69,990 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 12 మినీ రూ.69,990 కాగా.. ఐఫోన్ 12 ధర రూ.79,990గా చెబుతున్నారు. ఇక 12 ప్రో.. 12 ప్రో మ్యాక్స్ లను 128 జీబీ.. 256 జీబీల అంతర్గత మెమరీతో విడుదల చేస్తున్నారు. గ్రాఫైట్.. సిల్వర్.. గోల్డ్.. పసిఫిక్ బ్లూ.. గ్రీన్ కలర్ తో విడుదల చేస్తున్న ఈ ఫోన్ల ధరలు రూ.1,19,990 నుంచి రూ.1,29,990 మధ్యలో ఉంటాయని చెబుతున్నారు. సగటు జీవికి యాపిల్ 12 గురించి చదువుకోవటం.. వాటిని చూసుకోవటమే తప్పించి.. కొనే పరిస్థితి లేనట్లే.