Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం ఆఫీస్ అన్నారు.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ కు రిజైన్ చేశాడు

By:  Tupaki Desk   |   12 May 2022 4:29 AM GMT
వర్క్ ఫ్రం ఆఫీస్ అన్నారు.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ కు రిజైన్ చేశాడు
X
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఒక పట్టాన జీర్ణించుకోలేని ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. ఒక జాబ్ మానేయటానికి కారణాలు చెప్పమంటే.. బోలెడన్ని చెబుతారు. అయితే.. అవేమీ కూడా ఇప్పుడు మేం చెప్పే ఉదంతానికి సంబంధించిన వాటిల్లో ఉండే అవకాశమే ఉండదు.

ఇంతకీ ఆ పాయింట్లు ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. అందులో మొదటిది.. ఇక నుంచి ఇంటి నుంచి కాదు ఆఫీసుకు వచ్చి పని చేయాలని. అది కూడా యాపిల్ లాంటి కంపెనీలో జాబ్ అయితే అస్సలు ఆలోచించరు. అందునా ఏడాదికి రూ.6 - రూ.8 కోట్ల జీతమంటే.. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా బుద్ధిగా బాస్ చెప్పిన డేట్ కు పక్కాగా ఆఫీసుకు వెళ్లిపోతారు.

కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతంలో మాత్రం అందుకు భిన్నం. కరోనా తీవ్రత తగ్గిపోయిన నేపథ్యంలో ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ యాపిల్ కంపెనీ తన ఉద్యోగులకు చెప్పిన నేపథ్యంలో.. 'గుడ్ ఫెలో' అనే టెకీ తన జాబ్ కు రిజైన్ చేసి అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు. యాపిల్ లో అతగాడి జీతం గురించి అధికారికంగా తెలియకున్నా.. అనధికారికంగా మాత్రం ఏడాదికి రూ.6 - రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

యాపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అతగాడు.. హైబ్రిడ్ వర్క్ పాలసీకి వ్యతిరేకిస్తూ తన జాబ్ ను వదులుకున్నాడు. తన టీంలో పని చేసేవారికి మరింత వెసులుబాటు ఉండేలా నిర్ణయాలు ఉంటేనే.. ప్రొడక్టివిటీ బాగుంటుందని తాను నమ్ముతానని అతను వాదిస్తున్నాడు. అందుకే.. తాను యాపిల్ ను వీడుతున్నట్లుగా స్పష్టం చేశాడు. మే 23 నుంచి ఉద్యోగుల్ని వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఉద్యోగుల్ని స్పష్టం చేసింది.

ఇతగాడి నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. యాపిల్ కంపెనీ తాజాగా ఇంటి నుంచి పని చేస్తున్న తన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఉద్యోగుల్ని కోరగా.. ఈ పాలసీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులు రాజీనామా బాట పట్టటం ఇప్పుడా కంపనీ టాప్ మేనేజ్ మెంట్ కు ఇప్పుడీ అంశం ఒక పట్టాన కొరుకుడుపడటం లేదని చెప్పక తప్పదు.

ఈ నేపథ్యంలో గుడ్ ఫెలో ఉదంతం షాకింగ్ గా మారింది. అయితే.. ఇలాంటివారు ఎంతమంది ఉన్నారన్న దాని కన్నా..ఇలాంటి వారి కారణంగా సిస్టం ప్రభావితమై.. మార్పులకు కారణమవుతారని చెప్పక తప్పదు.