Begin typing your search above and press return to search.

జైల్లో జాత‌కాల కోర్సులో చేరింద‌ట‌!

By:  Tupaki Desk   |   15 July 2019 3:36 PM IST
జైల్లో జాత‌కాల కోర్సులో చేరింద‌ట‌!
X
నిజ‌మే.. గ‌తంలో ఏదైనా ఒక కేసు సంచ‌ల‌నంగా మారితే కొన్ని నెల‌ల పాటు అదే విష‌యం మీద వార్త‌లే వార్త‌లు వస్తుండేవి. పెరిగి వేగం.. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌తో.. ప్ర‌పంచంలో ఏ మూల ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో అంద‌రి వ‌ద్ద‌కు స‌మాచారం చేరిపోతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. అపూర్వ‌శుక్లా అన్నంత‌నే గుర్తుకు రాక‌పోవ‌చ్చు. కానీ.. మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారి త‌న‌యుడు రోహిత్ ను హ‌త్య చేసి.. త‌న‌కేం సంబంధం లేన‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చి.. త‌ర్వాత పోలీసుల‌కు దొరికిన అపూర్వ అంటే మాత్రం గుర్తుకు రావ‌టం ఖాయం.

భ‌ర్త‌ను చంపిన కేసులో ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న అపూర్వ‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. భ‌ర్త‌ను చంపినందుకు ఎలాంటి బాధ‌ను అపూర్వ వ్య‌క్తం చేయ‌టం లేద‌ని చెబుతున్నారు. బాధే లేక‌పోతే ప‌శ్చాతాపానికి ఛాన్సే లేన‌ట్లే. ఇక‌.. జైల్లో ఉంటున్న ఆమె.. జాత‌కాలు చెప్పే కోర్సులో చేరింద‌ట‌. వారానికి రెండు క్లాసులు చెబుతుంటార‌ని.. ఈ క్లాసుల‌కు టంచ‌న్ గా హాజ‌రవుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ మ‌ధ్య‌న విచార‌ణ కోసంకోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చి.. జాత‌కం క్లాస్ మిస్ అయినందుకు తెగ ఫీలైపోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ క్లాస్ లో ముందు వ‌ర‌సులో కూర్చొని.. ఈ కోర్సుకు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు తెగ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు.. రెండేసి గంట‌ల చొప్పున కోర్సును నేర్చుకుంటున్నార‌ట‌.