Begin typing your search above and press return to search.

ఆ ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష : డోనాల్డ్ ట్రంప్ !

By:  Tupaki Desk   |   18 Aug 2020 2:06 PM IST
ఆ ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష :  డోనాల్డ్ ట్రంప్ !
X
అగరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ‌ విలేకరుల సమావేశంలో‌ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ అతి ముఖ్య‌మైన వ్య‌క్తిని మంగళవారం క్ష‌మించ‌నున్న‌ట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ ముఖ్యమైన వ్యక్తి లో వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ కానీ, మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైఖేల్ ఫ్లిన్ కానీ లేరు అని స్పష్టం చేసారు. అయితే , ఎవరిని క్ష‌మిస్తున్నార‌న్న విష‌యాన్నిచెప్పేందుకు ట్రంప్ నిరాక‌రించారు. విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘రేపు చాలా ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టబోతున్నాను’ అ‍న్నారు.

స్నోడెన్‌ ఎన్‌ ఎస్ ‌ఏకు చెందిన దేశీయ, అంతార్జతీయ నిఘా కార్యకలాపాలకు సంబంధించిన రహస్య ఫైళ్లను 2013లో లీక్‌ చేశాడు. అతడు ఇప్పుడు రష్యాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ట్రంప్‌ స్నోడెన్‌ కు క్షమాభిక్షను పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు‌. గత నెలలో ట్రంప్‌ తన అధ్యక్ష అధికారాన్ని ఉపయోగించి తన చిరకాల మిత్రుడు, సలహాదారు రోజర్‌ స్టోన్‌ శిక్షను రద్దు చేశారు. అతడు 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తోన్న చట్టసభ సభ్యులు అతడిని దోషిగా వెల్లడైన సంగతి తెలిసిందే.