Begin typing your search above and press return to search.

తమిళ ఎన్నికల బరిలో ‘‘కలాం’’

By:  Tupaki Desk   |   1 March 2016 10:57 AM IST
తమిళ ఎన్నికల బరిలో ‘‘కలాం’’
X
భారతదేశానికి స్ఫూర్తిదాత.. కోట్లాది మంది కలలకు ముడిసరుకుగా నిలిచిన దివంగత మాజీ రాష్ట్రపతి.. స్ఫూర్తదాత ఏపీజే అబ్దుల్ కలాం పేరిట తమిళనాడులో సరికొత్త పార్టీ ఒకటి ఆవిర్భవించింది. కలాం ఆశయ సాధనే లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పడింది. కలాం కలల్ని సాకారం చేసేందుకు.. లక్షలాది మంది యువకుల డిమాండ్ మేరకు కలాం పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా పార్టీ వ్యవస్థాపకులు ప్రకటించారు.

కలాం దగ్గర 20 ఏళ్ల పాటు పని చేసిన పొన్ రాజ్.. రామేశ్వరంలోని ఆయన సమాధి వద్ద ‘‘అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ’’ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. కలాం కలల్ని సాకారం చేయటమే తమ పార్టీ లక్ష్యాలుగా పేర్కొన్న పొన్ రాజ్.. త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మరి.. కలాం పేరిట మొదలైన పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.