Begin typing your search above and press return to search.
రౌడీ సేన వెనక మాస్టర్ ప్లాన్...?
By: Tupaki Desk | 22 Nov 2022 8:54 PM ISTపవన్ కళ్యాణ్ సినీ రంగాన పవర్ స్టార్ గా ఉన్నారు. ఆయన పాతిక దాకా సినిమాల్లో నటించారు. అందులో హిట్లూ ఫట్లూ రెండూ ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో యూత్ ఎక్కువ. వారు పవన్ని అలా అట్టిపెట్టుకుని ఉన్నారు. పవన్ కి క్రేజ్ అంతా ఆ వర్గంలోనే ఎక్కువ.
ఇక రాజకీయాల్లో చూస్తే యూత్ ఓటింగ్ చాలా అవసరం. అదే టైం లో మిగిలిన వర్గాల మద్దతు మన్నన కూడా ఉండాలి. ముఖ్యంగా మహిళల మద్దతు ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. వారు ఎక్కువ శాతం ఓటర్లుగా ఉన్నారు. వారే పార్టీల తలరాతలను మారుస్తారు. దాంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఏకంగా ఆయన పార్టీకే రౌడీ సేన అని ట్యాగ్ ని తెచ్చి జనసేనకు తగిలించేసింది వైసీపీ.
ఇది అనూహ్యంగానో సెటైరికల్ గానో అన్న మాట కాదు, ఇది కావాలని వ్యూహాత్మకంగా ప్రత్యర్ధి పార్టీ మీద ఎక్కుబెట్టిన బాణంగా చూడాలి. దీని కంటే ముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద కూడా వైసీపీ ఘాటు వ్యాఖ్యలే చేసింది. దానికి ఇపుడు మరింత మసాలా దట్టించి రౌడీ సేన అంటోంది. సాధారణంగా రాజకీయాల్లో ఎవరు తర వెనక ఎలా ఉన్నా తెర ముందు నవ్వుతూనే ఉంటారు.
జనాలను ఇంప్రెస్ చేయడానికే చూస్తారు. ఆ విధంగా ఉంటేనే ఓట్లు పడతాయి అన్న భావన ఉంది. అదే నిజం కూడా. పవన్ విషయానికి వస్తే ఆయన మంచివాడు అన్న పేరు ఉన్నా ఆవేశపరుడు అన్న ముద్ర కూడా ఉంది. ఆయన రాజకీయాలలో చాలా సార్లు ఆవేశానికి లోను అయి ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. దాని వల్ల యువత విశేషంగా ఆయనకు నీరాజనాలు పలుకుతోంది, అదే టైం లో మిగిలిన సామాజికవర్గాల మద్దతు మన్నన దక్కాలీ అంటే కొంత జనసేన మారాలి అన్న చర్చ కూడా ఉంది.
ఇదిలా ఉండగానే పవన్ ఈ మధ్యన చెప్పు చూపిస్తూ మంగళగిరిలో చేసిన హాట్ హాట్ కామెంట్స్ నేరుగా ఆయన ఇమేజ్ మీద ప్రభావం చూపే విధంగా మారాయి. ఆయన ఎన్నడూ లేని విధంగా ఆవేశంతో ఊగిపోతూ చేసిన కామెంట్స్ ని ఇతర రాజకీయ పార్టీలు అన్నీ లైట్ తీసుకున్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని కలసి తమతో చేతులు కలపమని కోరారు కూడా.
అదే టైం లో వైసీపీ మాత్రం ఆయన ఆవేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. అందులో భాగమే రౌడీ సేన అని ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో జనసేన గురించి కామెంట్స్ చేశారు అని చెబుతున్నారు. దీని మీద జనసేన నాయకులు అంతా మూకుమ్మడిగా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ ఈ విధంగా దిగజారి మాట్లాడుతోంది అని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ అయితే ముఖ్యమంత్రి తన స్థాయి తగ్గి ఇలా మాట్లాడమేంటని ఫైర్ అయ్యారు. మాకు మీ కాండక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు అని తిప్పికొట్టారు.
సరే రాజకీయ పార్టీలు తోటి పార్టీలు ఎపుడూ మెచ్చవు. అందువల్ల ప్రజలే వారికి కాండక్ట్ సర్టిఫికేట్లు ఇస్తాయి. వారికి నచ్చేలా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకోవాలి. అయితే జనసేనలో ఉన్న అభిమానులు అనబడే సినీ ఫ్యాన్స్ కొంత ఎక్కువ ఆర్భాటం హడావుడి చేయడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయాల్లో సినీ ఫావరిజాలు నిజాలు పనిచేయవు. అక్కడ జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే ప్రత్యర్ధి పార్టీలు కార్నర్ చేస్తాయి.
ఇపుడు వైసీపీ ఆ పనిలోనే బిజీగా ఉంది. ఏపీలో బూతులు మాట్లాడే పార్టీ అని వైసీపీని ప్రత్యర్ధులు విమర్శిస్తే ఇపుడు జగన్ ఏకంగా టీడీపీని బూతుల పార్టీ అనేశారు. జనసేనను రౌడీ సేన అని టార్గెట్ చేశారు. ఇది జనంలోకి ఎంతవరకూ వెళ్తుందో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో జనసేనను తగ్గినడానికి వైసీపీ వాడే పదునైన అస్త్రాలలో ఇది ఒకటి అని అంటున్నారు.
దీని తిప్పికొట్టడం కేవలం మాటలకే కాకుండా జనసేన కూడా తన తీరుని కొంత మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు. ట్రెడిషనల్ పాలిటిక్స్ కే జనాలు అలవాటు పడ్డారు. ఆవేశంతో నిజాలు చెప్పినా ప్రజలకు ఎక్కవు కాబట్టి నవ్వుతూనే విపక్షాల మీద మాటలతో బాంబులు వేయాలి. సహనంతోనే ప్రత్యర్ధిని పలుచన చేయాలి. ఆ విద్యలో జనసేన ఆరితేరాల్సి ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.