Begin typing your search above and press return to search.
బీసీలపై సీఎం జగన్ వరాల జల్లు...52 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు - 12 మంది డైరెక్టర్లు!
By: Tupaki Desk | 22 July 2020 11:45 AM ISTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన సీఎం జగన్ ..ఆ నాటి నుండి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలోనే వెనుకబడిన కులాల (బీసీ) కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను ఈ నెలాఖరు కల్లా భర్తీ చేయాలనీ సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించడంతో పాటుగా ... 12 మంది డైరెక్టర్లని కూడా నియమించబోతున్నట్టు తెలిపారు. అందులో కులాల అభివృద్ది కోసం మొదటి నుండి కష్టపడుతూ వస్తున్న వారికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు.
బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అనేదాన్ని ఈ కార్పొరేషన్లు పర్యవేక్షించాలని , అందరికీ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం తెలిపారు. 5 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను వైఎస్ఆర్ చేయూత అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 25 లక్షల మంది మహిళలు పథకాలతో లబ్ది పొందారని గుర్తుచేశారు. వీరిలో అత్యధికులు బీసీ మహిళలే అని తెలిపారు.
గతంలో బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్డ్ గా ఎవరూ పని చేయలేదని ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. అలాగే , కొత్త వాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం 139 కులాలు చేర్చామని అధికారులు తెలిపారు. 10 లక్షలకు పైగల జనాభా ఉన్న కార్పొరేషన్లు ఆరు, లక్షకు పైగల కార్పొరేషన్లు 27, లక్షలోపు జనాభా గల కార్పొరేషన్లు 19 ఏర్పాటు చేశామ ని వివరించారు. దీంతో కార్పొరేషన్ల సంఖ్య 52కి చేరింది. 30 నుంచి 35 వేల జనాభా ఉన్న ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని , ప్రతి కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్లో చేర్చామని తెలిపారు.