Begin typing your search above and press return to search.
సౌత్ సీఎంలతో అమిత్‌షా భేటీ.. ఏం మాట్లాడబోతున్నారు..!
By: Tupaki Desk | 28 Feb 2021 1:33 PM ISTకేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 4న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై ముఖ్యమంంత్రులతో చర్చలు జరుపనున్నట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ మధ్య పలు జలవివాదాలు ఉన్న విషయం తెలిసిందే. కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.
ఏపీ కూడా తెలంగాణ ప్రాజెక్టులతో ఆంధ్రా ప్రాంతానికి నష్టం కలుగుతుందని వాదిస్తున్నది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ వివాదానికి కొంతైనా పరిష్కారం దొరుకుతుందేమో వేచి చూడాలి.
మార్చి4 న తిరుపతిలో అమిత్ షా సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.
నీటి ప్రాజెక్టులు, కేటాయింపులే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగబోతున్నట్టు సమాచారం. దీంతో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ అజెండాపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నట్టు సమాచారం. ఈ అంశాలను ఎజెండాగా చేర్చాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం తెలంగాణ చేసిన ఫిర్యాదు, పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాబేసిన్‌కు మళ్లించే నీటిలో ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం వాటా, ఆర్డీఎస్ ఆధునికీకరణ సహా పలు అంశాలను చేర్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, ఒక సంవత్సరం కేటాయించి వినియోగించుకోలేని నీటిని తర్వాత సంవత్సరానికి క్యారీఓవర్ స్టోరేజీగా అనుమతించే అంశాలను కూడా చేర్చాలని కోరింది.