Begin typing your search above and press return to search.

కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్.. షాకింగ్ ఘటన

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:00 PM IST
కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్.. షాకింగ్ ఘటన
X
60 ఏళ్లు వచ్చాయి.. ఏపీ శాసనసభకు స్పీకర్ గా ఉన్నాడు.అయినా సరే తగ్గేదే లే అని కబడ్డీ కోర్టులో దిగాడు.. బాగానే ఆడాడు.కానీ కింద పడిపోయాడు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం కబడ్డీ ఆడుతూ పడిపోవడం చూసి అందరూ షాక్ అయ్యారు. పెద్దాయనకు దెబ్బ తగిలిందా అని కంగారుపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్ గా మారిపోయాడు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందరినీ హుషారెత్తించాడు. ఈ క్రమంలోనే కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు.

సీతారం కిందపడిపోగానే సిబ్బందితోపాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ‘సీఎం కప్’ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా క్రికెట్, కబడ్డీ రెండు పోటీలు విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆముదాలవలస జూనియర్ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్థాయి టోర్నమెంట్లను ప్రారంభించి కబడ్డీ ఆడుతూ ఏపీ స్పీకర్ ఇలా కిందపడిపోయాడు. దెబ్బలు ఏమీ తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.