Begin typing your search above and press return to search.

ఏపీ : రివర్స్ టెండరింగ్ నుండి ఆ ప్రాజెక్టులకు మినహాయింపు

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:10 AM GMT
ఏపీ : రివర్స్ టెండరింగ్ నుండి ఆ ప్రాజెక్టులకు మినహాయింపు
X
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖజానా ఖాళీగా ఉందంటూనే అడ్డగోలుగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు నిధులను దోచిపెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాల్ని భారీగా పెంచారని విమర్శిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా .. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రాజెక్టు అమలుకు 2019లో ఏఐఐ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగింది. కొత్త విధానం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయడానికి ఏఐఐ బ్యాంకు నిరాకరించింది. పాత నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ పురపాలకశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏఐఐ బ్యాంకు నిధులు 5,350 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు పాలనా అనుమతులు ఇచ్చింది.

పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ఉద్దేశించిన ఏపీయూడబ్ల్యూ ఎస్ ఎస్ ఎంపీ అంచనా వ్యయాన్ని రూ.5350.62 కోట్లకు సవరిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఏప్రిల్ లో ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.5188.62 కోట్లు మాత్రమే కాగా, దానిని రూ.162 కోట్ల మేర పెంచి, అంచనాలను సవరించారు.ఈ నిధుల్లో ఏఐఐబీ, రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 70ు, 30ు భరిస్తుండగా, పట్టణ స్థానిక సంస్థలు నిర్వహణ ఖర్చులను భరించనున్నాయి. ఒకవేళ, పెంచిన అంచనా వ్యయానికి అనుగుణంగా తన వాటాను పెంచేందుకు ఏఐఐబీ గనుక నిరాకరిస్తే సదరు మొత్తాన్ని పట్టణ స్థానిక సంస్థలే వెచ్చించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పొందుపరిచారు.