Begin typing your search above and press return to search.
పెట్టుబడుల ర్యాంకింగ్: 13వ ర్యాంక్‌లో ఏపీ
By: Tupaki Desk | 3 Sept 2021 11:24 AM ISTగత చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీకి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో పరిశ్రమలను ఆకర్షించడంలో ఒకానొక సమయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ ప్రభుత్వం మారడంతో ఏపీ ర్యాంకు దిగజారింది.
పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక శాఖ నివేదిక ప్రకారం.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ఈక్విటీని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దిగువన ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏపీ పదమూడో స్థానంలో నిలిచింది.
ఈ నివేదిక అక్టోబర్ 2019 నుంచి జూన్ 2021 వరకు రాష్ట్రాల వారీగా విదేశీ పెట్టుబడులకు సంబంధించినది. కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినప్పటి నుండి ఇది ఖచ్చితమైన సంఖ్య. మునుపటి పాలనలో రాష్ట్రం ఎప్పుడూ టాప్ -4 లో ఉండేది. పొరుగున ఉన్న తెలంగాణ కూడా పెద్దగా మెరుగైన ర్యాంకులో లేదు. తెలంగాణ దేశంలో ఎనిమిదో ర్యాంకులో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన ర్యాంకులో ఉంది.
ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ 2577.1 కోట్ల రూపాయల ఎఫ్‌డిఐ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణ 17,709.15 కోట్ల రూపాయలను ఆకర్షించింది. అంటే ఏపీ కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడం విశేషం.. ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకబడడం గమనార్హం. ఈ జాబితాలో మూడో స్థానంలో పొరుగున ఉన్న కర్ణాటక ఉంది. ఈ రాష్ట్రం 1,49,715.38 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇతర పొరుగు రాష్ట్రాలు చూసుకుంటే తమిళనాడు 30,078.87 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలే పెట్టుబడలు ఆకర్షణలో విఫలమైనట్టుగా తెలుస్తోంది.