Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎన్నికల నినాదాన్ని డిసైడ్ చేయనున్న అసెంబ్లీ...?

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:39 PM GMT
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎన్నికల నినాదాన్ని డిసైడ్ చేయనున్న అసెంబ్లీ...?
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి మొదలుకాబోతున్నాయి. ఈ సమావేశాలు అత్యంత కీలకం అని చెప్పాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీకి మళ్ళీ రాజధాని సెగ తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో సంక్షేమాన్ని ముందు పెట్టుకుని ఓట్లను రాబట్టుకోవచ్చునని ఇప్పటిదాకా వైసీపీ భావించింది. సంక్షేమం అజెండాగా ఎన్నికలు జరిగితే అది కచ్చితంగా వైసీపీకి భారీ అడ్వాంటేజ్ గా ఉంటుంది.

ఆ విషయం టీడీపీకి కూడా తెలుసు. అందుకే టోటల్ ఏపీ రాజకీయాన్నే మలుపు తిప్పేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమరావతి రైతులకు అండగా ఉండడం అందులో భాగమే. అమరావతి టూ అరసవెల్లి గా సాగే రైతుల పాదయాత్ర కనుక సక్సెస్ అయితే కచ్చితంగా అది వైసీపీకి గట్టి దెబ్బ అవుతుంది. దాంతో పాటు టీడీపీకి భారీ రాజకీయ లాభం కలుగుతుంది.

ఈ నేపధ్యంలో వైసీపీ కూడా మూడు రాజధానుల మీద చర్చ ఏపీలో సాగాలని గట్టిగా కోరుకుంటోంది. ఈ పరిణామాల క్రమంలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలోనే మూడు రాజధానుల బిల్లుని మార్పులు చేర్పులు చేసి పెడుతుందని అంటున్నారు. ఈ బిల్లు మీద కచ్చితంగా ఏపీలో చర్చకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రా వాసుల నుంచి మళ్ళీ ఆశలు మొదలవుతాయి.

ఆ క్రమంలో అమరావతి మన రాజధాని కావాలని పాదయాత్ర చేసే రైతాంగానికి పూర్తి స్థాయిలో మద్దతు దక్కకపోవచ్చు. ఇక అసెంబ్లీలో వైసీపీ మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టే సందర్భంగా ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా జనాల్లో ఆలోచనలకు అవకాశం రేపుతాయని అంటున్నారు. అమరావతి ఏకైక రాజధాని హైదరాబాద్ మోడల్ అని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెబుతున్నారు.

అదే కనుక జరిగితే మరోసారి ఉత్తరాంధ్రా రాయలసీఅం వాసులు మోసపొతారు అని అంటున్నారు. దీంతో ఈ విషయం మళ్ళీ జనాలలో చర్చకు వచ్చే చాన్స్ ఉంది. దాంతో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు అన్నది చాలా కీలకం అంటున్నారు. ఇక మూడు రాజధానుల బిల్లును గతంలో కాకుండా మార్పుచేర్పులు చేసి ప్రవేశపెడతమని అంటున్నారు

అదే కనుక జరిగితే మాత్రం ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పుతాయి. అలా కాకుండా ఉంటే మాత్రం మళ్ళీ కోర్టుకు ఎవరైనా వెళ్తే తలబొప్పి కట్టడమే కాదు అమరావతి కోసం విపక్షం మూకుమ్మండిగా మద్దతు ఇస్తున్న వ్యవహారం హైలెట్ అయి వరికే లాభం కలుగుతుంది. ఇక అమరావతి రైతుల పాదయాత్ర ఒక వైపు ఉంటే మరో వైపు మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అంటే రానున్న రెండు నెలలూ రాష్ట్ర రాజెకీయాల్లో కీలకమైన పరిణామాలు జరుగుతాయని అంటున్నారు.

అదే టైం లో కేంద్రం కూడా చూస్తూ ఉంటుందా లేక తమ పార్టీ బీజేపీ ద్వారా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలను ప్రకటిస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఏపీ బీజేపీ అమరావతి అంటోంది. దానీకి కేంద్ర పెద్దల మద్దతు ఉందనే చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ సర్కార్ ఏపీలోని మొత్తం విపక్షాలతో పాటు కేంద్రాన్ని ఢీ కొట్టే అజెండాతోనే ముందుకు వస్తోందా అన్నదే చర్చ మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.