Begin typing your search above and press return to search.
రాజకీయ సినిమాలు రావాల్సిందే...అది రూలూ
By: Tupaki Desk | 28 Oct 2022 5:00 AM ISTరాజకీయాలు సినిమాలు కలగాపులగం అయి తెలుగు నాట దశాబ్దాల కాలం దాటింది. రంగు పులుకున్న వారికి రాజకీయమెందుకు అన్న వారే నివ్వెరపోయే విజయాలను వెండి తెర హీరోలు సాధించారు. అలాగే కధానాయకులు మహా నాయకులుగా జనంలో పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఆ రంగం నుంచి ఈ వైపు వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ సినిమాలకు ముడి సరుకు కూడా బాగా అందుతోంది.
సినిమాలకు అవరసమైన కంటెంట్ ఇక్కడ నుంచే దండీగా దక్కుతోంది. సినిమాల వల్ల జనాలు ఎంతమేరకు ప్రభావితం అవుతారు అన్నది పక్కన పెడితే రాజకీయా కధాంశాలతో సినిమాలు ఎప్పటి నుంచో రావడం జరుగుతోంది. వాటి మీద ఆసక్తి కూడా బాగానే ఉంటోంది. ఎన్నికల ముందు ప్రత్యర్ధులను చిత్తు చేయడానికో లేక తమ గొప్పలు చెప్పుకోవడానికో సినిమాలు తీయించే వారికి కొదవ లేదు.
2019 ఎన్నికల ముందు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. లక్ష్మీస్ ఎన్టీయార్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి ప్రభావం కూడా ఎంతో కొంత ఉంది. దానికి ముందు ఎన్టీయార్ సీఎం గా ఉన్న రోజుల్లో సూపర్ స్టార్ క్రిష్ణ ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కి అనుకూలంగా కొన్ని సినిమాలు తీశారు. అవి కూడా విజయాలతో సంబంధం లేకుండా సంచలనం రేపాయి. ఇపుడు 2024 వస్తోంది. ఎన్నికలు ముందున ఉన్నాయి.
దాంతో మళ్ళీ రాజకీయ సినిమాలకు రంగం సిద్ధం అవుతోంది. వైసీపీ ఈ విషయంలో ముందుందా అన్న డౌట్లు వస్తునాయి. రాజకీయ సినిమాలు తీయడంలో దిట్టగా పేరు గడించిన రాం గోపాల్ వర్గం జగన్ తో తాజాగా గంట పాటు భేటీ వేశారు అన్న వార్త ఎంత సీక్రెట్ గా ఉంచినా బయటకు పొక్కింది. సాధారణంగా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ వర్మతో గంటకు పైగా ముచ్చటించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. వర్మతో జగన్ భేటీ అంటే కచ్చితంగా సినిమాల గురించే అని ఆంతా అనుకున్నారు
దానికి తగినట్లుగా వర్మ ఈ రోజు ట్విట్టర్ వేదికగా తాను తీయబోయే రాజకీయ చిత్ర్రాలను ప్రకటించారు. వ్యూహం, శపధం పేరిట రెండు పార్టులుగా సినిమాలను తీసి జనాలలోకి వదలబోతున్నట్లుగా ఆయన ప్రకటించేశారు. ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అని ఆయన చెబుతున్నా ఆయన ట్విట్టర్ లో చెప్పిన దానిని బట్టి చూస్తే జగన్ జీవిత చరిత్రనే సినిమాలుగా తీయబోతున్నారు అని అర్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలలో హీరో జగన్ అయితే విలన్లు కచ్చితంగా రాజకీయ ప్రత్యర్ధులు ఉంటారు. వారు జాతీయ ప్రాంతీయ స్థాయిలో నేతలు ఉంటారని అంటున్నారు. నిజానికి వర్మ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమాలు తీస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే జగన్ స్టోరీఏ టేకప్ చేయబోతున్నారు అని అర్ధమవుతోంది.
ఇక ఆయన మూడు సినిమాలు తీస్తారని అంటున్నారు. అయితే అందులో మూడవ సినిమా మాత్రం కచ్చితంగా పవన్ టార్గెట్ గా ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది. సరే వైసీపీ సినిమాలు ఇవి. మరి సహజంగా హీరో అయిన పవన్ ఊరుకుంటారా. ఆయన మార్క్ సినిమాలు ఆయన కూడా తీస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇంకో వైపు తెలుగుదేశం పార్టీ హీరో అయిన బాలయ్య బోయపాటి శ్రీనుతో ఒక పొలిటికల్ మూవీని 2023లో మొదలెట్టి 2024 ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రాబోయేవి అన్నీ రాజకీయ సినిమాలే. చూడాలి మరి ఈ బొమ్మలు, వాటి వెనక ఉన్న రాజకీయ పార్టీలలో హిట్లు ఎవరికి దక్కుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.