Begin typing your search above and press return to search.

మద్యం అక్రమరవాణాలో చిక్కిన ఏపీ పోలీసులు

By:  Tupaki Desk   |   2 Sept 2020 10:28 AM IST
మద్యం అక్రమరవాణాలో చిక్కిన ఏపీ పోలీసులు
X
ఏపీలో మద్యపాన నిషేధం దిశగా నడుస్తున్న వైఎస్ జగన్ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో పక్కరాష్ట్రంలోని చీప్ మద్యం ఏపీకి పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే అక్రమ మద్యం రవాణాకు చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులను రంగంలోకి దింపింది. అయితే మద్యం అక్రమ రవాణాకు ఏపీ పోలీసులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో ఇద్దరు ఏపీ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం బట్టబయలైంది.

కర్ణాటకలోని తుంకూరు జిల్లా పావగడ తాలూకాలోని జాలేడు గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ఏపీలోకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు. వారిని విచారించగా ఏపీ స్పెషల్ పోలీస్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు చెందిన ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టుబుళ్లు సహకరించినట్లుగా పేర్కొన్నారు. 50వేలు లంచం తీసుకొని సహకరించారని తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రామ్మోహన్ తెలిపారు.

ఏపీకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాల నుంచి చీప్ మద్యం పోటెత్తుతోంది. దీన్ని స్వయంగా కొందరు నేతలే సరఫరా చేస్తూ దొరికారు. దీనికి పోలీసుల సహకారం ఉందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది.