Begin typing your search above and press return to search.

గంటలోనే 4 బాలికలను పట్టుకున్న ఏపీ పోలీసులు

By:  Tupaki Desk   |   15 Nov 2020 10:45 AM IST
గంటలోనే 4 బాలికలను పట్టుకున్న ఏపీ పోలీసులు
X
పారిపోయిన నలుగురు బాలికలను గంటలో పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసులు సత్తాచాటారు. తల్లిదండ్రులను పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ ఇప్పించి వారిద్దరికీ రాజీ కుదిర్చి పంపించారు.

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన నలుగురు మైనర్ బాలికలు ఈ సాహసానికి తెగబడ్డారు. కరోనా ప్రభావంతో స్కూళ్లు బంద్ కావడంతో ఆన్ లైన్ లో క్లాసులు సెల్ ఫోన్ లో చూస్తున్నారు. ఇందులో ఒకరు 10వ తరగతి.. ఇకరు 9, ఇద్దరు 8వ తరగతి బాలికలున్నారు. వీరంతా ప్రాణస్నేహితులు.

అయితే ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో అతిగా సెల్ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రులు గట్టిగా వారించారు. సెల్ ఫోన్ లో ఆటలు ఆడడం.. సినిమాలు చూడడం చేస్తున్నారు. తల్లిదండ్రులు వారించినా బాలికల్లో మార్పులేకపోవడంతో గట్టిగా మందలించారు.

అలిగిన నలుగురు బాలికలు ఇంట్లోంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కూడబలుక్కొని పారిపోయారు. డిపోలో బస్సు ఎక్కేశారు. పొదిలి నుంచి దర్శి వరకు వెళ్లారు. అక్కడి నుంచి వినుకొండ డిపోకు చెందిన బస్సులో వినుకొండకు వెళ్లారు.

పిల్లలు కనపడకపోవడంతో ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు తెలిసిన వారిని విచారించి రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రంగంలోకి దిగి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించారు. వినుకొండలోని కారంపూడి రోడ్డులో బాలికలు ఉన్నారని గుర్తించారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.

బంధువులు కూడా రంగంలోకి దిగి బాలికలను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటలోనే బాలికలను గుర్తించిన పోలీసులను అభినందించారు.