Begin typing your search above and press return to search.

మంత్రి అనిల్, రోజా.. ఇక లోకేష్ ను ‘పప్పు’ అనలేరా?

By:  Tupaki Desk   |   31 Oct 2019 6:04 AM GMT
మంత్రి అనిల్, రోజా.. ఇక లోకేష్ ను ‘పప్పు’ అనలేరా?
X
జగన్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను వైసీపీ వాళ్లు పప్పు అనకుండా పోయిందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అన్నారో వాటిని పేపర్లో ప్రచురించారో బుక్కైపోతారు. కేసులు నమోదవుతాయి. లోకేష్ ను పదే పదే ‘పప్పు’ అని విమర్శించే మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్లకు ఇప్పుడు చేయికొట్టేసినంత పని అయిపోతోందన్న బాధ వ్యక్తమవుతోందట.. పప్పు అన్నా.. సెటైర్లు వేసినా ఇప్పుడు శిక్షార్హులవుతారు.. టీడీపీ కంటే వైసీపీకే నష్టం చేకూర్చేలా ఈ జీవో ఉందని వైసీపీ శ్రేణులు తెగ బాధపడిపోతున్నాయట...

‘గోబెల్స్ ప్రచారం..’ జర్మనీ నియంత హిట్లర్ తన అక్రమాలు బయటపడకుండా గోబెల్స్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించి దాన్నే ప్రజలు నమ్మేలా చేసేవాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజంగా చెప్పి దాన్ని నిజం చేసేశాడు.. అదే గోబెల్స్ ప్రచారంగా ఖ్యాతికెక్కింది. ఇప్పుడు తెలుగునాట కూడా మీడియా ధోరణి అలానే ఉందన్న అనుమానాలు రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా తీరు మాత్రం ‘గోబెల్స్’లాగానే సాగుతుందన్న అనుమానం అధికార వైసీపీలో ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే ఏపీలో సమస్యలపై గోబెల్స్ ప్రచారం చేస్తూ తిమ్మిన బమ్మిని చేసి ప్రజలకు అవాస్తవాలు ప్రసారం చేస్తూ కళ్లకు గంతలు కడుతున్న టీడీపీ మీడియాపై వైసీపీ ప్రభుత్వం తాజాగా కొరఢా ఝలిపించింది. జీవో 2430 జారీ చేసింది.

*అసలేంటి జీవో.?
జగన్ సర్కారు తాజాగా జీవో 2430ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఏపీలో నిరాధార కథనాలు రాసినా.. ప్రసారం చేసినా కేసులు వేసేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులకు అనుమతులు ఇస్తూ జారీ చేసింది. ఈ జీవోపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా మీడియా భగ్గుమంది. ఈ జీవో వల్ల మీడియా స్వేచ్ఛకు , ప్రజల వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగించేలా ఉందని విమర్శించాయి. విలేకరులను భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం వల్ల ప్రభుత్వంలోని లోటుపాట్లను మీడియా ఎత్తిచూపకుండా ఉంటుందని.. ఇది ప్రజలకు నష్టం చేకూరుస్తుందని మండిపడ్డారు. ఈ జీవో రద్దుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు ప్రతిపక్షాలు పురిగొల్పులుతున్నాయి.

*జీవోతో వాక్ స్వాతంత్ర్యం హరిస్తుందా?
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 మాత్రం ప్రజలు, నేతలు, మీడియా వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలాగానే కనిపిస్తోంది. దేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. తమకు నచ్చని దేనినైనా విమర్శించే వాక్ స్వాతంత్ర్యం హక్కును మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ జగన్ సర్కారు తెచ్చిన జీవో మాత్రం నిబంధనలకు విరుద్ధమేని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్ష విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చి వారిని ఎదుర్కొంటేనే బెటర్. ఇలాంటి జీవోలతో కంట్రోల్ చేయాలనుకోవడం పొరపాటేనని విశ్లేషకులు చెబుతున్నారు.