Begin typing your search above and press return to search.
విడదలకు విశాఖ బాధ్యతలు
By: Tupaki Desk | 19 April 2022 8:00 PM ISTవిశాఖ జిల్లా అంటే జగన్ కి ఒక ప్రత్యేక అభిమానం. ఇక విశాఖ అర్బన్ ప్రాంతాలను అన్నీ కలుపుకుని జిల్లాగా ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఏదైనా అవకాశం వస్తే, న్యాయపరమైన అవరోధాలను అధిగమిస్తే విశాఖను పాలనారాజధానిగా చేయవచ్చు అన్న మాట కూడా ఉంది. ఈ మధ్యనే మునిసిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్ మూడు రాజధానులు తమ విధానం అని గట్టిగా నొక్కి చెప్పారు కూడా.
ఆ సంగతి అలా ఉంటే విశాఖ జిల్లాకు మంత్రి అంటూ ఎవరూ లేరు. అనకాపల్లి జిల్లాకు మాత్రం ఇద్దరు మంత్రులను ఇచ్చారు. ఆ విధంగా చూస్తే విశాఖకు అన్యాయం జరిగింది అన్న బాధ అయితే వైసీపీ నేతలలో ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విశాఖ జిల్లా ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇంచార్జి మంత్రుల నియామకం చేపడుతున్నారని అంటున్నారు.
విశాఖ జిల్లాను హోం డిస్ట్రిక్ట్ గా జగన్ భావిస్తారు. దాంతో విశాఖ ఇంచార్జి మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి అప్పగించారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రిగా జగన్ సన్నిహితుడుగా పేరున్న కన్నబాబు పనిచేశారు. దాంతో విడదల రజనీ ఇక మీదట విశాఖ ఇంచార్జి గానే కాదు, మంత్రిగా కూడా ఉంటారన్న మాట.
మరో వైపు చూస్తే మొత్తం పాతిక మంది మంత్రులనూ అన్ని జిల్లాలకూ ఇంచార్జిగా నియమించేశారు. బొత్స సత్యనారాయణకు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తే గుడివాడ అమరనాధ్ కి పార్వతీపురం, రాజన్నదొరకు అనకాపల్లి ఇంచార్జిగా బాధ్యతలు ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావుకు గుంటూరు బాధ్యతలు ఇచ్చారు. బూడి ముత్యాల నాయుడుకి విజయనగరం జిల్లా ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తే సీదరి అప్పలరాజుకు కాకినాడ జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.