Begin typing your search above and press return to search.

ఏపీమంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వ్ !

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:30 PM GMT
ఏపీమంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వ్ !
X
మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై గతంలో సీబీఐ ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ ఐఆర్‌ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్‌ చేసింది సీబీఐ.విచారణ సందర్భంగా ఈ కేసులో ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.

మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని తెలిపింది. ఛార్జ్‌ షీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది. క్షక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందని సురేశ్‌ దంపతులు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆదిమూలపు సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో హైకోర్టు సీబీఐ ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నందున మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణలో వాదనలు పూర్తయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్దానం తుది తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో సీబీఐ కక్షపూరితంగా తమపై కేసులు నమోదు చేసిందని ఆదిమూలపు సురేష్ దంపతులు వాదిస్తుండగా, సీబీఐ మాత్రం మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్షిషీట్ దాఖలు చేస్తామని చెబుతోంది.