దసరా స్పెషల్: చేపలు పట్టిన మంత్రి అప్పలరాజు

Tue Oct 27 2020 13:05:51 GMT+0530 (IST)

ap minister sidiri appalaraju enjoyed with friends and family members

ఏపీ మత్య్స పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా నిత్యం బిజీగా ఉండే డాక్టర్ సీదరి అప్పలరాజు దసరా నాడు సేదతీరారు. పండుగ పూట తనకిష్టమైన వ్యాపకమైన చేపల వేటకు వెళ్లారు.  శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తన స్వగ్రామం దేవునల్తాడలో సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపారు.సోదరుడు సీదిరి చిరంజీవితో కలిసి నడి సముద్రంలోకి చేపల వేటకు మంత్రి అప్పలరాజు వెళ్లారు. తోటి మత్య్సకారులు కూడా వచ్చారు.  వల పట్టుకొని విసిరారు. 30 పనాల వరకు చేపలు చిక్కాయి. ఆనందంతో మంత్రి గంతులేశారు.

అనంతరం చేపలతో తీరానికి చేరుకున్న మంత్రి భావనపాడు తీరానికి  సతీసమేతంగా వెళ్లి సముద్ర స్నానాలు చేశారు. తర్వాత చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడిపారు.

చేపల వేటకు వెళ్లి చాలా రోజులైందని.. ప్రధానంగా ఆటవిడుపు కుటుంబం స్నేహితుల మధ్య సరదాగా గడపడంతో బాల్యం గుర్తుకు వచ్చిందన్నారు. మత్య్సకారులకు అవసరమైన సహాయం చేస్తామని.. ఇంజిన్లు సరఫరా చేస్తామని మంత్రి అప్పలరాజు అన్నారు.