Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు ఎప్పుడో చెప్పేసిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   3 Sept 2022 10:35 AM IST
మూడు రాజధానులు ఎప్పుడో చెప్పేసిన ఏపీ మంత్రి
X
ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించటం.. దానికి భారీ ఎత్తున శంకుస్థాపన చేయటం తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హాజరై.. ఆశీర్వదించిన అమరావతికి భిన్నంగా.. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చింది జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. అయితే.. దీనిపై నెలకొన్ని అనేక సమస్యల కారణంగా.. అటు అమరావతి కాకుండా ఇటు మూడు రాజధానులు కాకుండా పోయింది.

కోర్టులో ఉన్న ఈ అంశంపై.. రాష్ట్రం కూడా వేచి చూసే ధోరణిని ప్రదర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్య చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావిస్తారని మంత్రి పేర్కొన్నారు.

తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్ని అమలు చేస్తామని తాము చెప్పలేదని.. అయినప్పటికీ ఇప్పటికే 90 శాతానికి పైనే పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికలకు మరింత సమయం ఉన్న నేపథ్యంలో మిగిలినవి కూడా పూర్తి చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మకమైన బల్క్ డ్రగ్ పార్కు రాష్ట్రానికి వస్తుంటే.. అది వద్దంటూ టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు కేంద్రానికి లేఖ రాయం విడ్డూరమన్నారు.

ఫార్మా రంగానికి ఏపీ హబ్ గా మారుతుందని.. తాముఏ పరిశ్రమ వచ్చినా కూడా స్వాగతిస్తామన్నారు. విభజన హామీల్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.

రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని ఆర్ బీఐ కు లేఖ రాసిన వైనంపై టీడీపీ నేతల్ని తిట్టిపోసిన గుడివాడ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న చంద్రబాబును.. లోకేశ్ ను జైలుకు పంపాలన్న డిమాండ్ చేయడం గమనార్హం. మొత్తానికి చాలా కాలం తర్వాత ఏపీ మంత్రి ఒకరి నోటి నుంచి మూడు రాజధానుల మాట వచ్చిన నేపథ్యంలో.. మరేం జరగనుందన్నది ఆసక్తి వ్యక్తమవుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.