Begin typing your search above and press return to search.

పేకాట క్లబ్ పై స్పందించిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   28 Aug 2020 12:40 PM IST
పేకాట క్లబ్ పై స్పందించిన ఏపీ మంత్రి
X
కర్నూలు జిల్లా గుమ్మనూరులో భారీ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే పట్టుబడిన ఈ పేకాట నిర్వహిస్తున్న నారాయణ అనే వ్యక్తి ఏపీ మంత్రి జయరాంకు వరుసకు సోదరుడు అని పోలీసులకు తెలిసినట్టు సమాచారం. ఇది కాస్తా అక్కడ చర్చనీయాంశమైంది. పోలీసులు రంగప్రవేశం చేసే సరికి కారం పొడితో పోలీసులపైనే తిరగబడడం సంచలనమైంది.

ఈ పేకాట స్థావరానికి కర్నూలుతోపాటు అనంతపురం, కడప, చిత్తూరు, బెంగళూరు, బళ్లారి, రాయచూరు నుంచి కూడా భారీ సంఖ్యలో జూదరులు వచ్చి పేకాట ఆడడాన్ని గమనించిన పోలీసులు నిఘా పెట్టి మఫ్టీలో అక్కడికి వెళ్లి రహస్యంగా విచారించారు. పోలీసులను కనిపెట్టి జూదరులు దాడి చేసి కారం చల్లి.. సెల్ ఫోన్లు లాక్కున్నారు. వారు వెళ్లిన ఆటోను ధ్వంసం చేశారు.

పోలీసుల సమాచారంతో ఎస్పీ గౌతమి శాలి 30మందితో పేకాటస్థావరంపై దాడి చేసింది. చాలా మంది పారిపోగా.. 41మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ మంత్రి జయరాంకు వరుసకు సోదరుడైన గమ్మనూరు నారాయణ ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నారాయణ పరారీలో ఉన్నాడు.

గుమ్మనూరులో తనకు వరసకు సోదరుడు అయ్యే వ్యక్తి పేకాట స్థావరం నిర్వహిస్తుండడంపై ఏపీ మంత్రి జయరాం స్పందించారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమన్నారు.