Begin typing your search above and press return to search.
రెడ్లు కూడా ఎస్సీలుగా పుట్టాలని అనుకుంటున్నారు
By: Tupaki Desk | 19 April 2022 6:28 AM ISTఏపీలో ముఖ్యమంత్రి జగన్ భజన పరాకాష్టకు చేరుతోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జగన్ 2.0 కేబినెట్‌లో మళ్లీ అవకాశం దక్కించుకున్న చిత్తూరుజిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి.. సచివాలయంలో ఉపముఖ్యమంత్రిగా, ఎక్సైజు శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రి గా బాధ్యతలు చేపట్టేందుకు దేవుడి చిత్రపటం బదులుగా సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చారు. అంతేకాదు.. ఆ ఫొటోకే పూజలు చేసి.. బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంట్ విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎస్సీలకు పెద్దపీట వేస్తున్నారని.. మంత్రి పదువులు ఇస్తున్నారని.. రాజకీయంగా ప్రాధాన్యం పెంచుతున్నారని.. అన్నారు. అంతేకాదు.. ఎస్సీలకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి.. రెడ్డి వర్గానికి చెందిన నాయకులు కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని అనుకుంటున్నారని.. నారాయణస్వామి అన్నారు. దేవుని లక్షణాలు ఉన్న మానవుడు జగనేనని భజన చేశారు.
సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామని నారాయణస్వామి స్పష్టంచేశారు. సెబ్, ఎక్సైజ్ శాఖ సహకారం బాగా ఉందని అన్నారు. తమ శాఖలో చాలామందిని సస్పెండ్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణస్వామి అన్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు దేవుడి చిత్రపటం బదులుగా సీఎం జగన్ చిత్రపటాన్ని నారాయణ స్వామి తీసుకువచ్చారు. బడుగుల దేవుడిగా జగన్ అవతరించారు అందుకే ఆయన చిత్రపటానికి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణ స్వామి స్పష్టం చేశారు.