Begin typing your search above and press return to search.
మంత్రి పదవి పోతేనే హాయిట...?
By: Tupaki Desk | 30 March 2022 11:00 PM ISTఒక వైపు మంత్రి కుర్చీ కోసం వైసీపీలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. రేసులో యాభై నుంచి డెబ్బై మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే కుర్చీ దిగిపోతామనుకుంటున్నవారి పరిస్థితి మరోలా ఉంది. మంత్రిగా జగన్ క్యాబినెట్ లో 34 నెలల పాటు పనిచేసిన వారు విభిన్నంగా స్పందిస్తున్నారు.
మంత్రి పదవి ఉంటేనే బాధ, పోతేనే హాయి అన్నట్లుగా కూడా కొందరు మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. తాజాగా అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అయితే మంత్రి పదవి పోతనే హాయి అని మాట్లాడారు. తానేమీ అవినీతికి పాల్పడలేదు, ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగానే సగం పాలన పూర్తి అయిన తరువాత మంత్రులను మారుస్తున్నారు.
ఇందులో బాధ ఏముందని ఆయన అంటున్నారు. అందువల్ల తనకు మాజీ మంత్రి అన్న ట్యాగ్ వచ్చినా హ్యాపీయే అంటున్నారీ మంత్రి. ఇంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని కూడా మంత్రిగా ఉంటే తాను వేరు, లేకపోతే విశ్వరూపమే విపక్షాలకు చూపిస్తాను అని మాట్లాడారు. అంటే మంత్రి పదవి వల్ల తాను ఫ్రీగా ఉండలేకపోతున్నాను అన్నదైతే ఆయన భావం అనుకోవాలి.
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది మంత్రులు కూడా మంత్రి పదవుల విషయంలో తమదైన శైలిలో మాట్లాడారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మంత్రిగా ఎవరిని ఉంచాలీ, ఎవరిని పక్కన పెట్టాలి అన్నది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆయనకు తనకు నచ్చిన మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని కూడా మాట్లాడారు.
మొత్తానికి చూస్తే చాలా మంది మంత్రులకు తాము మాజీలు కాబోతున్నామని తెలిసిపోయింది అని అంటున్నారు. ఇక ఒకరిద్దరు మాత్రమే పాత మంత్రులలో ఉంటారని తెలుస్తోంది. దాంతో దాదాపుగా 24 మంది ఉన్న మంత్రుల్లో 22 మంది దాకా మాజీలు కాక తప్పదని ఖాయమైన వేళ మంత్రులు అంతా ఇపుడు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారా లేక ఎటూ పదవి పోతుంది కాబట్టి అలా రియాక్ట్ అవుతున్నారా అన్నది చూడాలి.
ఏది ఏమైనా మంత్రిగా పనిచేసి మాజీ కావడం అంటే కొంత ఇబ్బందే. కానీ జగన్ పెట్టుకున్న నియమం ప్రకారం మంత్రులుగా సగం కాలమే వారి కుర్చీకి ఆయుష్షు. నాడు మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన టైంలో ఈ కండిషన్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇపుడు కొత్త మంత్రివర్గ విస్తరణ వేళ మాత్రం ప్రస్తుత మినిష్టర్ల రియాక్షన్స్ తలో విధంగా ఉంటున్నాయి. మరి రేపటి రోజున నిజంగా మాజీలు అయిన తరువాత ఇంకెలా స్పందిస్తారో చూడాలి.