Begin typing your search above and press return to search.

కొడుక్కి నారాయ‌ణ చెప్పిన చివ‌రి మాట‌లివే..

By:  Tupaki Desk   |   11 May 2017 6:08 AM GMT
కొడుక్కి నారాయ‌ణ చెప్పిన చివ‌రి మాట‌లివే..
X
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన మంత్రి నారాయ‌ణ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం అంద‌రిని క‌లిచివేస్తోంది. చిన్న‌వ‌య‌సులోనూ.. ఊహించ‌ని కార‌ణంతో మృతి చెంద‌టం.. చేతికి వ‌చ్చిన కొడుకు తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన వైనం అంద‌రిని విషాదంలో ముంచెత్తుతోంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నుల్లో భాగంగా బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న నారాయ‌ణ‌..కొడుకు మ‌ర‌ణ వార్త విని హుటాహుటిన బ‌య‌లుదేరారు.
అయితే.. కొడుకు మ‌ర‌ణ‌నికి కొద్ది గంట‌ల ముందు.. ఆయ‌న లండ‌న్ నుంచి ఫోన్ చేసి మాట్లాడిన మాట‌లు విన్న వారంతా తీవ్ర ఉద్వేగానికి గురి అవుతున్నారు.

ప్ర‌మాదానికి కొన్ని గంట‌ల ముందు లండ‌న్ లోని నారాయ‌ణ‌.. కొడుకు విషీత్‌కు ఫోన్ చేశారు. విషీ ఎక్క‌డున్న‌వా్‌.. ఏం చేస్తున్నావ‌న్న మాట‌ల‌తో మొద‌లైన వారి సంభాష‌ణ‌.. జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లు అని అన్న ఆయ‌న‌.. నీతో మాట్లాడ‌క‌పోతే నిద్ర ప‌ట్ట‌దురా క‌న్నా అని చెప్పిన‌ట్లుగా చెప్పారు.

ఈ ఫోన్ సంభాష‌ణ ప్ర‌మాదం జ‌రిగిన రాత్రి (మంగ‌ళ‌వారం) ప‌ద‌కొండు గంట‌ల సమ‌యంలో చోటు చేసుకుంది. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలు కావ‌టం తెలిసిందే. గురువారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల ప్రాంతంలో నెల్లూరుకు చేరుకున్న నారాయ‌ణ‌.. కొడుకు మృత‌దేహాన్ని చూసి క‌న్నీరు మున్నీర‌య్యారు. కొడుకుతో తాను మాట్లాడిన చివ‌రి మాట‌లు గుర్తు చేసుకొని వేద‌న చెందుతున్న తీరు.. అక్క‌డున్న వారిని కంట‌త‌డి పుట్టించేలా చేసింది.