Begin typing your search above and press return to search.

న‌న్ను పోటీ చేయ‌మ‌ని జ‌గ‌న్ బ‌తిమాలుతున్నారు: మంత్రి ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   3 Jan 2023 10:15 PM IST
న‌న్ను పోటీ చేయ‌మ‌ని జ‌గ‌న్ బ‌తిమాలుతున్నారు:  మంత్రి ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ మంత్రి, సీనియ‌ర్ నేత‌, ఉత్త‌రాంద్ర‌కు చెందిన ధర్మాన ప్ర‌సాద‌రావు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, కానీ, సీఎం జ‌గ‌న్ త‌న‌ను బ‌తిమాలుతున్నార‌ని చెప్పుకొచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి వైసీపీ జెండాపై పోటీ చేసిన ప్ర‌సాద‌రావు విజ‌యం ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూ ఇక్క‌డ ఆయ‌న గెలుపును రాసిపెట్టుకునే ప‌రిస్థితి ఉంది. ఎందుకంటే.. ఒకింత టీడీపీ ఇక్క‌డ వీక్‌గా ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ స‌ద‌వ‌కాశాన్ని త‌న త‌న‌యుడికి అందించాల‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడిగా రామ్ మ‌నోహ‌ర్‌నాయుడిని బ‌రిలో దింపాల‌నేది ప్ర‌సాద‌రావు ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా ఆయ‌న పాల్గొనేకార్య‌క్ర‌మాల‌కు త‌న‌యుడిని తీసుకువెళ్తున్నారు. అయితే.. దీనికి సీఎం జ‌గ‌న్ అడ్డు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటే..త‌ర్వాత ఇక ఎదురే లేద‌ని ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు. వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్న‌వారికి ముఖ్యంగా ఇదే చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నికల్లో పెద్ద‌గా మార్పులు ఉండ‌బోవ‌ని కూడా సీఎం సంకేతాలు ఇచ్చారు. ఈ విష‌యాన్ని బ‌హుశ మ‌న‌సులో పెట్టుకునే.. ప్ర‌సాద‌రావు ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని.. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం ఈ సారికి మీరే పోటీ చేయాల‌ని చెబుతున్నార‌ని ప్ర‌సాద‌రావు తెలిపారు.

అయితే..ఈ  క్ర‌మంలో ఆయ‌న వార‌సుడి విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. వ‌చ్చే త‌రం నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేదే త‌న వ్యూహ‌మ‌ని, భ‌విష్య‌త్ రాజ‌కీయ నేత‌ల‌ను త‌యారు చేయాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌ని, అందుకే పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికి ధ‌ర్మాన వ్యాఖ్య‌లు.. వ‌రుస‌గా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. విశాఖ‌ను రాజ‌దాని చేయండి.. లేక పోతే.. ప్ర‌త్యేక రాష్ట్రంఇ ఇచ్చేయండి.. అని ధ‌ర్మాన చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రిచిపోక ముందే.. ఇప్పుడు సీటు విష‌యంలోనూ ఆయ‌న హాట్ కామెంట్లు కుమ్మ‌రించ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.