Begin typing your search above and press return to search.

ఆ రెండూ మా కళ్ళు అంటున్న బొత్స....?

By:  Tupaki Desk   |   25 April 2022 2:59 PM GMT
ఆ రెండూ మా కళ్ళు అంటున్న బొత్స....?
X
ప్రభుత్వానికి ఎన్నో కళ్ళు, మరెన్నో ఆలోచనలు ఉంటాయి. ప్రభుత్వం అంటేనే సహస్త్రాక్షిగా చూడాలి. అలాంటి ప్రభుత్వానికి ప్రాధాన్యతలు కూడా చాలానే ఉంటాయి. అన్నింటికంటే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. దాంతో మాకు అవే కళ్ళూ చెవులూ అన్నీ అని చెప్పుకుంటుంది.

ఇదిలా ఉండగా విద్య, వైద్యం మా ప్రభుత్వానికి రెండు కళ్ళు అని కొత్త విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. మేము గతానికి భిన్నగా ఈ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. బడ్జెట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ఘనత కూడా జగన్ సర్కార్ దే అని ఆయన అన్నారు.

విద్యా రంగంలో సంస్కరణలు శ్రీకారం చుట్టిన గొప్పతనం కూడా తమ ప్రభుత్వానిదే అని ఆయన అంటున్నారు. ఉన్నత విద్యా రంగం అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏపీలో మొత్తం 55 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

తమది పాజిటివ్ ప్రభుత్వమని, సమస్యలు ఏమి ఉన్నా సామరస్యంగా మనవతా దృక్పధంతో ఆలోచించి పరిష్కరించే ప్రభుత్వమని బొత్స చెప్పడం విశేషం. సీపీఎస్ రద్దు విషయంలో యూటీఎఫ్ చలో సీఎంఓ కు ఎలా పిలుపు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు ప్రభుత్వం కమిటీని వేసి సమస్య పరిష్కరించడానికి చూస్తూంటే శాంతి భద్రతల సమస్యను సృష్టించడం ఎవరికీ మంచిది కాదని ఆయన హితవు పలికారు.