Begin typing your search above and press return to search.

ఇంకా వెయిట్ చేస్తున్న బొత్స... అయ్యే పనేనా..?

By:  Tupaki Desk   |   22 April 2022 2:05 AM GMT
ఇంకా వెయిట్ చేస్తున్న బొత్స... అయ్యే పనేనా..?
X
ఉత్తరాంధ్రాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వేచి చూస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా సొంత జిల్లా విజయనగరంలోనే ఉంటున్నారు. ఆయన తన వద్దకు వచ్చే వారిని కలుస్తూ పరిమితమైన బిజినెస్ లో మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ అయితే పెద్దగా లేవు. మొత్తానికి ఒక్కటి మాత్రం వాస్తవమని అంటున్నారు. బొత్స వెయిట్ చేస్తున్నారు అన్నదే ఆ మాటగా చెబుతున్నారు.

ఇంతకీ బొత్స ఎందుకు వెయిట్ చేస్తున్నారు, దేని కోసం చూస్తున్నారు అంటే జగన్ నిర్ణయం కోసమే అని అంటున్నారు. బొత్స ఈ నెల 11న మంత్రిగా మలివిడత విస్తరణలో ప్రమాణం చేశారు. అదే రోజు సాయంత్రం శాఖల కేటాయింపు జరిగింది. బొత్సకు విద్యా శాఖ ఇచ్చారు. దాని మీద ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎలా చేశారో అందరికీ తెలిసిందే.

ఆ విషయం అలా ఉంచితే బొత్సకు ఆ శాఖ అంతగా ఇష్టం లేదు అని అంటున్నారు. దాంతోనే ఆయన జగన్ సమక్షంలో జరిగిన తొలి విడత సమీక్షకే డుమ్మా కొట్టారు అని చెబుతున్నారు. దీని మీద మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా బొత్స డుమ్మా కొట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. సరే ఈ సంకేతాలు సందేశాలు రాజకీయాల పట్ల ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యేవే.

ఇక ఆ తరువాత మరో ప్రచారం కూడా బయటకు వచ్చింది. బొత్స తాను చూసే పాత శాఖ మునిసిపల్ డిపార్ట్మెంట్ నే తిరిగి ఇమ్మని జగన్ని కోరారని అంటున్నారు. దాని మీద అయితే జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. బొత్స శాఖను ఆదిమూలపు సురేష్ కి ఇచ్చారు. ఆయన మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇప్పటికి రెండు మూడు సార్లు మీడియా ముందుకు కూడా వచ్చారు.

అంటే ఆయన డ్యూటీలోకి దిగిపోయినట్లే. బొత్స మాత్రం సురేష్ నుంచి వచ్చిన విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. మరి జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని తనకు మునిసిపల్ శాఖను తిరిగి అప్పగిస్తారు అని బొత్స భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికైతే బుగ్గన రాజేంద్రనాధ్, బొత్స తప్ప అందరి మంత్రులు చార్జి తీసేసుకున్నారు. బుగ్గన కారణాలు వేరు. కానీ బొత్స విషయం మాత్రం రాజకీయంగా హాట్ హాట్ చర్చగానే ఉంది. జగన్ కనుక నో అంటే ఏమి చేస్తారు అన్న దాని మీద కూడా డిస్కషన్ సాగుతోంది. మొత్తానికి బొత్స వ్యవహారం వైసీపీలోనూ ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గానే ఉంది మరి.