Begin typing your search above and press return to search.
ప్రమాదంలో పోలవరం.. మంత్రి వ్యాఖ్యలతో కన్ఫర్మ్!
By: Tupaki Desk | 21 April 2022 9:00 PM ISTఏపీ ప్రజల జల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీల కులు. తాజాగా దీనిపై వ్యాఖ్యానించిన.. తాజా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెం ట్స్ చేశారు. దీనిని బట్టి పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందనే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరు తోంది.
తాజాగా గురువారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు.. పూజల అనంతరం.. మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులోనిడయాఫ్రం వాల్ దెబ్బతిందని చెప్పారు. దీనికి సంబంధించి ఐఐటీ చెన్నై, ఐఐటీ ముంబై నుంచి నిపుణులు వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. అదేసమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు కూడా వచ్చి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు తెలిపారు. అనంతరం వారు కొన్ని రికమండేషన్లు కూడా చేయనున్నారని చెప్పారు.
``ఈ నేపథ్యంలో మేం మరోసారి డయాఫ్రం వాల్‌ను నిర్మించాల్సి రావొచ్చు`` అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి.. టీడీపీ ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు. ``పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్.. ఏపీకి వరం. పోలవరంతో రైతులందరికీ మేలు జరుగుతుంది. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తా. పోలవరంపై అడ్డంకులను అధిగమిస్తాం. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి పరిస్థితులు ఎందుకు వచ్చాయి. డయా ఫ్రమ్ దెబ్బతిన్న సందర్బాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణం`` అని అన్నారు.
``డయా ఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారు. చంద్రబాబు ధన దాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కూడా దీనికి కారణం. చంద్రబాబు, ఉమలు ఈ జాతికి సమాధానం చెప్పాలని’’ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే నది వరద నీటిని తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం స్పిల్‌వే ఏర్పాటు చేయలేదన్నారు. స్పిల్‌వే సిద్ధంగా లేనందున, 2019లో వరద నీరు ఎగువ కాఫర్ డ్యామ్‌ను బద్దలు కొట్టి డయాఫ్రమ్ వాల్‌కు నష్టం కలిగించిందని విమర్శంచారు. టీడీపీ హయాంలో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా ఉపయోగించుకుని డబ్బులు ఇచ్చిన పనులు చేపట్టారని ఆరోపించారు.
దీనివల్ల ప్రస్తుతం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, డయాఫ్రమ్‌వాల్ మరమ్మతులు లేదా పునరుద్ధరణ వల్ల రాష్ట్ర ఖజానాకు మరో రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మ కమైన జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ హయాంలో ప్రాధాన్యత ఉన్న పనులను విస్మరించారని ఆరోపించారు. అయితే, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును తిరస్కరిస్తే ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటనే దానిపై మంత్రికి సమాధానం ఇవ్వలేదు.