Begin typing your search above and press return to search.
అంబటికి మంత్రి పదవి అందుకేనా?
By: Tupaki Desk | 12 April 2022 8:00 AM ISTతాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో.. ఉమ్మడి గుంటూరు.. ప్రస్తుత పల్నాడు జిల్లా నుంచి కాపు సామాజి క వర్గం కోటా కింద.. అంబటి రాంబాబు.. మంత్రి పదవి సాధించారు. ఆయన సత్తెనపల్లి నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈయనకు పదవి రావడం వెనుక.. సటైర్లు.. విపక్షంపై విమర్శలే కీలకంగా మారాయని.. అవే ఆయనకు ప్లస్‌లు కూడా అయ్యాయని అంటున్నారు. ఇక, అంబటి రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడం రెండో పర్యాయం. మొదటి సారి రేపల్లె నుంచి కాంగ్రెస్ హయాంలో 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తరువాత 2019లో వైసీపీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఆనాటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును ఓడించా రు. తనకున్న వాగ్ధాటితో ముఖ్యమంత్రిని ఆకట్టుకుంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబా బును వ్యక్తి గతంగా దూషించటం ద్వారా జగన్‌కు దగ్గరయ్యా రు. కాపు కోటాలో అంబటికి మంత్రి పదవిని కల్పించారు. అంబటి రాంబాబు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
గుంటూరు జిల్లా రేపల్లెలో ఏవీఎస్ఆర్ ఆంజనేయులు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన 1986లో బీఎల్ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1988లో జిల్లా లీగల్‌సెల్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. 1989లో రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుపొందారు. నెడ్‌క్యాప్ చైర్మన్‌గా, ఏపీఐఐసీసీ చైర్మన్‌గానూ పనిచేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగానూ ఉన్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంచి వాగ్ధాటి.. ఉన్నప్పటికీ.. అప్పటికప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంలో మాత్రం ఆయన దూకుడుగా ఉండరనే పేరుండడం గమనార్హం. పైగా.. స్థానికంగా... ఇటీవల కాలంలో ఆయనపై అవినీతి మరకలు కూడా పడ్డాయి.