Begin typing your search above and press return to search.

మంత్రి అఖిల‌ప్రియ పెళ్లి ముహుర్తం ఖ‌రారు!

By:  Tupaki Desk   |   13 May 2018 6:28 AM GMT
మంత్రి అఖిల‌ప్రియ పెళ్లి ముహుర్తం ఖ‌రారు!
X
వ‌రుస పెట్టి విషాదాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భూమా ఫ్యామిలీలో ఇప్పుడు పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌ల్లిని.. తండ్రిని కోల్పోయిన భూమా అఖిల‌ప్రియ‌.. అన్నీతానై ఇంటిని న‌డిపిస్తోంది. రాజ‌కీయంగా త‌న త‌ల్లిదండ్రులు ఇచ్చిన వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ.. భూమా హ‌వాకు ఎక్క‌డా బ్రేకులు ప‌డ‌కుండా చూసే విష‌యంలో ఆమె విప‌రీతంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె వివాహానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల అధినేత‌.. వ్యాపార‌వేత్త మ‌ద్దూర్ భార్గ‌వ్‌తో ఆమె వివాహాన్ని డిసైడ్ చేశారు. రెండు కుటుంబాల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు.. స‌న్నిహితుల న‌డుమ అత్యంత నిరాడంబ‌రంగా సాగిన నిశ్చితార్థం హైద‌రాబాద్ లోని భూమా నివాసంలో జ‌రిగింది.

ఏపీ ప‌ర్యాట‌క మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న భూమా అఖిల‌ప్రియకు మొద‌ట వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ‌.. ప్ర‌స్తుతం క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి కుమారుడు న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డితో పెళ్లి జ‌రిగింది. త‌ర్వాతి కాలంలో వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో వారు విడాకులు తీసుకున్నారు. తాజాగా అఖిల ప్రియ పెళ్లాడ‌నున్న భార్గ‌వ్ కూడా గ‌తంలో ఒక‌సారి పెళ్లై.. విడాకులు తీసుకున్నారు.

మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు కుమార్తెను భార్గ‌వ్ వివాహ‌మాడారు. త‌ర్వాతి కాలంలో వారు విడాకులు తీసుకున్నారు. కొంత‌కాలంగా ప‌రిచ‌యం ఉన్న వీరిద్ద‌రూ పెళ్లాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో అనూహ్యంగా మ‌ర‌ణించిన త‌ల్లి శోభానాగిరెడ్డి మ‌ర‌ణం అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల త‌న స‌త్తాను చాటుతున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్ద‌రి పెళ్లి ఆగ‌స్టు 29న జ‌ర‌పాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మానికి అఖిల మేన‌మామ క‌మ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డితో పాటు స‌న్నిహిత బంధువులు హాజ‌రైన‌ట్లుగా తెలుస్తోంది.