Begin typing your search above and press return to search.

ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానం

By:  Tupaki Desk   |   15 Feb 2020 8:00 PM IST
ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానం
X
విభజనతో నష్టపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పరిశ్రమలు అన్నీ హైదరాబాద్ లోనే ఉండడంతో హైదరాబాద్ ను వదిలేసి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మొదలైంది. లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పటిష్ట చర్యలు కావాలి. అందుకనుగుణంగా అడుగులు పడడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. పారిశ్రామికరణకు పెద్దపీట వేయడంతో పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే ఏ రాష్ట్రానికి కాకుండా ఏపీకి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. ఐదేళ్లల్లో పోలిస్తే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో 10శాతం వాటా దక్కించుకుని ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో పారిశ్రామికరణకు అవకాశాలు మెండుగా ఉండడం.. వాతావరణం అనుకూలంగా, నీటి లభ్యత, వనరుల వినియోగం తదితర ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ప్రైవేటు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు అత్యధికం గా వస్తున్నాయి.