Begin typing your search above and press return to search.

ఏపీ టెన్త్‌, ఇంటర్ పరీక్ష తేదీలపై నేడే స్పష్టత .. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ !

By:  Tupaki Desk   |   17 Jun 2021 5:30 AM GMT
ఏపీ టెన్త్‌, ఇంటర్ పరీక్ష తేదీలపై నేడే స్పష్టత .. సీఎం  నిర్ణయంపై ఉత్కంఠ !
X
గత కొన్ని రోజులుగా ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణ విషయంలో తీవ్రమైన జాప్యం కొనసాగుతుంది. ఈ పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి నేడు (గురువారం) తెరపడే అవకాశాలు ఉన్నాయా , విద్యార్ధులు కోరుకున్నది జరుగుతుందా, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం సీఎం ప్రకటించబోయే నిర్ణయంతో తేలిపోనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. నాడు.. నేడు కార్యక్రమంతోపాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేపట్టనున్న నూతన విధనాలు, పరీక్షల నిర్వాహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణకు సంబంధించి ఇప్పటికే కరోనా నిబంధనలకు అనుగుణంగా విద్యాశాఖ ఒక షెడ్యూల్ ను రూపొందించింది. దాన్ని సీఎం ముందుకు తీసుకురాబోతున్నారు.

దీనిపై ఆయన తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విద్యావేత్తుల, విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి పరీక్షలను రద్దు చేయాలన్న విన్నపాలు ప్రభుత్వానికి అందాయి. అయితే జాతీయస్ధాయి విద్యావిధానంతో రాష్ట్రంలోని విద్యావిధానం ముడిపడి ఉంది.ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమౌతుండటంతో పరీక్షల పేరుతో కాలయాపన చేస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమౌతుంది. దీనితో సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని విద్యార్థులు , తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే .. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామన్నారు.

జులై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు, అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉపాధ్యాయులతో కూడా చచ్చించడం జరిగిందన్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల తేదీ, ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.