Begin typing your search above and press return to search.

ఆ లోన్ల విషయంలో చివరి స్థానంలో ఏపీ

By:  Tupaki Desk   |   23 Aug 2021 4:59 AM GMT
ఆ లోన్ల విషయంలో చివరి స్థానంలో ఏపీ
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగే సమయంలో చికిత్స కోసం దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది లోన్లు తీసుకున్నారో తెలుసా, కరోనా మహమ్మారి మన దేశంలో కోట్లాది కుటుంబాలను బాధితులుగా మార్చేసింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది కరోనా నుంచి బయటపడేందుకు ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. కరోనా లోన్లు అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంక్ లు, ప్రైవేటు బ్యాంకులకు పలు ఆదేశాలిచ్చింది. కరోనా పాజిటివ్ ఉన్నవారికి చికిత్స కోసం పర్సనల్ లోన్లు ఇవ్వాలని సూచించింది. అవగాహన ఉన్నవారు లోన్లు తీసుకున్నారు, లేనివారు బయట అప్పులు తెచ్చి సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాష్ట్రాలు ఎంతమందికి కరోనా లోన్లు ఇచ్చాయనే సర్వే జరిగింది

దేశ వ్యాప్తంగా 1.33 లక్షల మంది కరోనా చికిత్స కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ జాబితాలో తమిళనాడు తొలి స్థానంలో నిలవగా... ఆ తర్వాతి స్థానాలను కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు ఆక్రమించాయి. తమిళనాడులో 33,917 మంది రుణాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.తెలంగాణలో 3,389 మంది, ఆంధ్రప్రదేశ్ లో 2,791 మంది లోన్లు తీసుకున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేయడంతో... చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు.

బ్యాంకులు కూడా అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చాయి. దీంతో కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలను కోల్పోయిన ఎంతో మంది ఈ వెసులుబాటును ఉపయోగించుకుని రుణాలు తీసుకున్నారు. కరోనా చికిత్స కోసం ఉదారంగా లోన్లు ఇవ్వాలని, అవి అన్ సెక్యూర్డ్ రుణాలని కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది. ఈమేరకు బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.అయితే బ్యాంకులు మాత్రం ఈ లోన్ల విషయంలో కూడా సవాలక్ష కండిషన్లు పెట్టాయి. ముఖ్యంగా ఏపీలో రుణాల విషయంలో బ్యాంకులు మరీ దారుణంగా వ్యవహరించాయి. కరోనా లోన్ల విషయంలో బ్యాంకులు పెద్దగా ప్రచారం చేయలేదు. కొంతమంది తెలుసుకుని లోన్లకోసం వచ్చినా, వారికి సవాలక్ష కండిషన్లు పెడుతున్నాయి బ్యాంకులు. ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ఉదారంగా ఉన్నాయి. కరోనా చికిత్సకోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలయినా కేంద్రం ఆదుకోలేకపోయిం, కనీసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలన్నా అదీ కుదరలేదు. అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐల వాయిదా ఒక్కటే కేంద్రం చేయగలిగింది. అంతకు మించి ఏమైనా చేయాలనుకున్నా బ్యాంకులు సహకరించడంలేదు