Begin typing your search above and press return to search.

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసా? హైకోర్టు చేసిన వ్యాఖ్యలేమిటి?

By:  Tupaki Desk   |   12 Nov 2020 10:15 AM IST
ఎస్సీలపైనే అట్రాసిటీ కేసా? హైకోర్టు చేసిన వ్యాఖ్యలేమిటి?
X
కొద్దిరోజులు క్రితం ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళన నిర్వహించేందుకు వెళుతున్న రైతుల్ని.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంతో సంబంధం లేని వారు ఎలా వెళ్లి.. ఆందోళన చేస్తారని ప్రశ్నించారు.ఈ వివాదం చివరకు పోలీసుల వద్దకు వెళ్లటం.. ఆందోళనకువెళుతున్న వారిని నిలువరించే ప్రయత్నం చేసిన వారిపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటం.. వారిని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించటం తెలిసిందే.

ఈ సందర్భంగా సదరు రైతులు దాఖలు చేసిన బెయిల్ ను గుంటూరు సెషన్స్ కోర్టు కొట్టేసింది. రైతుల్ని జైలుకు తరలించే వేళలో.. చేతికి సంకెళ్లు వేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటివేళ.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో పోలీసుల తీరుపై న్యాయస్థానం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎస్సీలపై అట్రాసిటీ కేసును నమోదు చేయటం ఏమిటంటూ విస్మయాన్ని వ్యక్తం చేసింది.

బెయిల్ బుల్ కేసులో బెయిల్ ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు..అరెస్టుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు ఎక్కడ ఉందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని పాటించటంలో పోలీసులు ఫెయిల్ అయినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీలపై ఎస్సీ.. ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టటానికి వీల్లేదని.. రైతుల తరపు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదించారు. అంతేకాదు.. తమను కులం పేరుతో దూషించినట్లుగా కంప్లైంట్ కాపీలో లేదన్నారు.

దీంతో స్పందించిన హైకోర్టు.. బెయిల్ కోసం గుంటూరు కోర్టులో ఈ అంశాలు విచారణలో రాలేదా? అని ప్రశ్నించారు. లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొంటూ.. దర్యాప్తు పెండింగ్ లోఉందని పేర్కొన్నారు. ఈ కారణంగానే బెయిల్ ను గుంటూరు సెషన్స్ కోర్టు రిజెక్టుచేసిందన్నారు. బెయిలబుల్ నేరాల్లో రిమాండ్ కు పంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

కంప్లైంట్ తప్పించి తానెలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని ఫిర్యాదుదారు చెబుతున్న నేపథ్యంలో.. ఇప్పుడేం చెబుతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కులం పేరుతో దూషించలేదని ఫిర్యాదుదారు అఫిడవిట్ దాఖలు చేసినా గుంటూరు కోర్టు ఆ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకో లేదని ప్రశ్నించారు. రెండు గ్రూపుల మధ్య వివాదం నేపథ్యం లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంగా పోలీసులు రిమాండ్ కోరినట్లు గా పేర్కొన్నారు. మరి.. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టు లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. మొత్తంగా.. రాజధాని రైతుల అరెస్టు తీరు ను తీవ్రంగా తప్పు పట్టిన ఏపీ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయం లో ఈ ఉదంతం లో బెయిల్ ఇవ్వకుండా నో చెప్పిన గుంటూరు సెషన్స్ కోర్టు నివేదిక పంపాలని హై కోర్టు పేర్కొంది.