Begin typing your search above and press return to search.
ఆ అమ్మాయిని తీసుకొని రండి.. జిల్లా ఎస్పీ ఏపీ హైకోర్టు ఆదేశం
By: Tupaki Desk | 2 Sept 2020 12:45 PM ISTఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువతిని జిల్లా ఎస్పీ స్వయంగా వెంటపెట్టుకొని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ రాకేశ్ కుమార్.. జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాల్ని జారీ చేసింది. జిల్లాలో చర్చగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన ఒక యువకుడు తాజాగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ప్రేమ వివాహం చేసుకున్నానని.. తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తండ్రి అధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
తన భార్యను తన వద్దకు పంపాలని కోర్టును కోరారు. దీనిపై స్పందిచిన ధర్మాసనం తాజాగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఆ యువతిని కోర్టుకు తీసుకురావాలని పేర్కొంది. దీంతో.. సదరు యువతిని తీసుకొని కోర్టు ముందుకు జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా గురువారం హాజరు కావాల్సి ఉంది. మరేం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.