Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు సీరియస్.. నోటీసులు జారీ అయిన వారెవరంటే?

By:  Tupaki Desk   |   27 May 2020 4:30 AM GMT
ఏపీ హైకోర్టు సీరియస్.. నోటీసులు జారీ అయిన వారెవరంటే?
X
అభిమానం ఉండాల్సిందే. కానీ.. అదెప్పుడూ హద్దులు దాటకూడదు. ఈ మధ్యన ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైనంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ‘‘హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటే అంతమందిని ముక్కలుగా నరకాలి. అందరినీ నరకాల్సిందే. మొత్తం జడ్జిలను ఒక గదిలో పెట్టి.. అదే గదిలోకి కరోనా రోగిని వదలాలి’’ అంటూ సోషల్ మీడియాలో చందూరెడ్డి అనే వ్యక్తి పెట్టిన పోస్టుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు అపాదించటమే కాదు.. న్యాయ మూర్తుల్ని దూషిస్తూ.. వారిని ముక్కలు.. ముక్కలుగా నరకాలనటం.. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వారిపై హైకోర్టు చర్యల్ని స్టార్ట్ చేసింది. ఈ తరహా పోస్టులతోపాటు.. హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన పలువురిని గుర్తించిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 24 మధ్యన కోర్టులను.. జడ్జిలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పలు వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు ఏపీ హైకోర్టుకు అందినట్లుగా పేర్కొన్నారు. పలు వీడియో క్లిప్పింగులు.. సోషల్ మీడియా లో పోస్టుల ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు.

ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో యూట్యూబ్ వీడియోక్లిప్పులు ఆధారంగానూ.. ఫేస్ బుక్.. ట్విట్టర్ లో పెట్టిన పోస్టులను పరిగణలోకి తీసుకున్నారు. నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న వారిలో కొందరిని గుర్తించాల్సి ఉంది.

యూట్యూబ్ వీడియో క్లిప్ ఆధారంగా
బాపట్ల ఎంపీ నందిగం సురేశ్
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి
మెట్టా చంద్రశేఖర్ రావు
గోపాల క్రిష్ణ కళానిధి
ఫేస్ బుక్
కిశోర్ రెడ్డి దరిశ
శ్రీధర్ రెడ్డి అవుతు
లింగారెడ్డి
లింగారెడ్డి రాజశేఖర రెడ్డి
ఎం. ఇంద్రసేనా రెడ్డి
జలగం వెంకట సత్యనారాయణ
దుద్దల ప్రేమ్ చంద్
కె. గౌతమి
ఫేస్ బుక్ జఫ్పా జగన్నాధం గ్రూపు
సాయి కిరణ్ రెడ్డి
పల్లి వెంకటరెడ్డి
సతీశ్ కుమార్
సిస్టల మణికుమార్
మాన్విత
ట్విట్టర్
ఎలిమినేటి లోకేశ్
డెవిల్ అటార్నీ
ఇంటూరి రవి కిరణ్
బి. విరాట్ విష్ణు
రవి జగన్
చిరంజీవి
రమేష్ గంటా
డాక్టర్ రవి కుమార్
అర్జున్ గంజి
లోకేశ్ రెడ్డి
రాచమ్ శ్రీనివాస రెడ్డి
వెంకటరెడ్డి
చందా ప్రదీప్ కుమార్ రెడ్డి
వెంకట్ రెడ్డి
రామాంజనేయ రెడ్డి
జి. శ్రీధర్ రెడ్డి
చందూ రెడ్డి
గుర్తించాల్సిన వారు
రవిచంద్రారెడ్డి
మారుతి రెడ్డి
ముతికేపల్లి శ్రీనివాసరెడ్డి
రఘురామిరెడ్డి
పి. శ్రీను
చింతాడ సతీశ్
అమానుల్లా ఖాన్
తుపురాని శ్రీనాథ్
శ్రీనాధ్ సుస్వరం