Begin typing your search above and press return to search.

తాజా ఎపిసోడ్ లో జగన్ సర్కారుకు దన్నుగా ఏపీ హైకోర్టు

By:  Tupaki Desk   |   31 Aug 2022 5:06 AM GMT
తాజా ఎపిసోడ్ లో జగన్ సర్కారుకు దన్నుగా ఏపీ హైకోర్టు
X
ప్రతికూల వార్తలు.. నెగిటివ్ అంశాలు.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే అంశాల్ని హైలెట్ చేయటం.. అందుకు భిన్నంగా మరికొన్ని సానుకూల అంశాలకు ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వకుండా చేయటం కొన్ని సందర్భాల్లో మీడియాలో చూస్తుంటాం. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

ఏపీలోని పాఠశాలల్ని విలీనం చేయాలని.. టీచర్లను హేతుబద్ధీకరణ చేసేందుకు వీలుగా వైఎస్ జగన్ సర్కారు కీలకనిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుల్ని ఆశ్రయించారు.

జగన్ ప్రభుత్వం జారీ చేసిన పాఠశాలలు విలీనం.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంశాలకు సంబంధించిన జీవోను జారీ చేశారు. దీన్ని తప్పు పడుతూ.. వ్యతిరేకిస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ పేరుతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం తామీ విషయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తున్నారని.. దీని కారణంగా విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇది ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని నడపటం తమ విధి కాదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు దీనిపై ప్రభుత్వ వాదనను వినిపించేందుకు కౌంట్ వేస్తామని.. అందుకు కాస్తంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.