Begin typing your search above and press return to search.
పంచ్ ప్రభాకర్ తిడుతుంటే ఎంజాయ్ చేశారు.. మరి కష్టాల్లో ఉన్నప్పుడు?
By: Tupaki Desk | 10 Dec 2021 9:36 AM ISTసోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారుడిగా చెలామణి అవుతూ ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులలో మొదటి పేరు పంచ్ ప్రభాకర్. అదే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న పంచ్ ప్రభాకర్ తను చేసే వ్యాఖ్యలనే తన ఇంటిపేరుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే.
ఇటు టీడీపీ నేతలను, అటు న్యాయవ్యవస్థలోని వారిని కూడా తన నోటికి వచ్చినట్టు తిట్టిపోసి.. తాను ఇండియన్ ను కాదని, అమెరికన్‌ను అని.. తనను ఎవరూ ఏమీ చేయలని ప్రభాకర్ తనకుతానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు.
ఎవరినీ వదిలి పెట్టకుండా .. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వరకూ ఎవరు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై "అమ్మ..నా బూతులు" ప్రయోగిస్తూ .. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా? అనే రేంజ్‌లో వ్యవహరించారు. అత్యంత దారుణమైన భాషతో ఉండే ఆయన వ్యాఖ్యలపై తరచూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతూనే ఉన్నాయి.
కులాలను తిట్టడం నుంచి న్యాయవ్యవస్థ, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారిని కూడా వదిలి పెట్టలేదు. అందుకే ఇటీవల ఆయన పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రవాసాంధ్రుడైన పంచ్ ప్రభాకర్ అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వారని చెబుతారు. వెటర్నరీ డాక్టర్ అయిన ఆయన అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. రెడ్డి సామాజిక వర్గం కావడంతో వైసీపీతో సన్నిహితంగా ఉంటాడని అంటారు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడని అంటారు.
అయితే ఓ సారి కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో పంచ్ ప్రభాకర్‌తో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకు సంబంధం లేదని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కానీ, అంతకుముందు మాత్రం.. మాకు ఒక మగాడు దొరికాడంటూ.. ప్రచారం చేసుకున్నారు.
ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అనుచితంగా దూషించిన కేసులో ఆయనకు గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన ప్రతీ రోజూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉన్నాడు. ప్రతీ వీడియోలోనూ ఆయన వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారో వారిని బండ బూతులు తిట్టడం తెలిసిందే.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజులను కూడా ఆయన వదల్లేదు. ఈ అంశంపై ఢిల్లీలో కూడా కేసు నమోదయింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
న్యాయమూర్తులపై దూషణల కేసుల్లోనూ ఆయన పేరు కీలకంగా ఉండటం.. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ వంటి వారినీ చంపుతానన్నట్లుగా మాట్లాడి ఉండటంతో ఆయనను ఇండియాకు పిలిపిస్తారని అనుకున్నారు.
కానీ ఆయనను పట్టుకోవడానికి సీబీఐ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఆయన వీడియోలు అలా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. హైకోర్టు ఆగ్రహించిన తర్వాత ఆయన చానల్ ఇండియాలో మాత్రం కనిపించకుండా లాక్ చేసుకున్నారు. ఇప్పుడు హైకోర్టు పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు పది రోజు డెడ్ లైన్ పెట్టింది.
అయితే.. గతంలో పంచ్‌లు వేసినప్పుడు ప్రభాకర్‌ను తమ వాడుగా ప్రచారం చేసుకున్న వైసీపీ నాయకులు.. ఇప్పుడు.. సీబీఐ, ఇంటర్ పోల్ సహా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కన్నెర్ర చేసే సరికి మాత్రం వైసీపీ పట్టించుకోవడం మానేసింది. అమెరికా కోర్టుల వరకు చేరిన ఈ వివాదంలో పంచ్ ప్రభాకర్‌కు లాయర్ల ఫీజు తడిసిమోపెడు అవుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇప్పుడు మోరల్ సపోర్టు కూడా ప్రభాకర్‌కు వైసీపీ నుంచి కనిపించడం లేదు.
ఇటీవల ఇవే విషయాలను ప్రభాకర్ ఇండియాలోని చానెళ్లకు కూడా వివరించాడని అంటున్నారు.. ఈ వివాదంతో ఆయన కుటుంబంలోనూ కలహాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఏదేమైనా.. వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. వాడుకున్నన్ని రోజులు వాడుకుని ఇప్పుడు కేసులు చుట్టుముట్టే సరికి ఆయనను వదిలించుకుంటారా? అని నెటిజన్లు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.