Begin typing your search above and press return to search.

మూడు నెలలు ముందుగా ముహుర్తం వెల్లడి

By:  Tupaki Desk   |   21 July 2015 4:24 AM GMT
మూడు నెలలు ముందుగా ముహుర్తం వెల్లడి
X
ఆంధ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజధాని నగరమైన అమరావతి నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైన శంకుస్థాపన ముహుర్తం వెల్లడైంది. సరిగ్గా మూడు నెలల ముందుగా ఈ ముహుర్తాన్ని వెల్లడించటం గమనార్హం.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఎవరూ ఊహించని స్థాయిలో చేపట్టాలని.. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల అధ్యక్షుల్ని పిలిచి భూమిపూజ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జపాన్ ప్రధానిని శంకుస్థాపన కోసం ఏపీ ముఖ్యమంత్రి ఆహ్వానించటం..ఆయన వస్తానని చెప్పటం తెలిసిందే. ఏపీ రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకభూమిక పోషించనున్న సింగపూర్.. జపాన్.. చైనా దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి నేతలు అమరావతి శంకుస్థాపనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ విదేశీ వీవీఐపీతో పాటు.. దేశ ప్రధాని మోడీ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ముహుర్తం విషయానికి వస్తే.. అక్టోబరు 22న అమరావతి శంకుస్థాపనకు తేదీగా నిర్ణయించారు. శంకుస్థాపనకు సంబంధించిన ముహుర్తం ఇతిమిద్ధంగా తేలనప్పటికీ.. శంకుస్థాపన మాత్రం దసరా రోజున ఉంటుదన్న విషయాన్ని మాత్రం ప్రకటించారు. ఈసారి దసరా.. ఏపీకి ఎప్పటికి గుర్తుండిపోతుందన్న భావనను ఏపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.