Begin typing your search above and press return to search.
అన్‌లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్ ... స్కూళ్ల ఓపెనింగ్ పై కీలక నిర్ణయం
By: Tupaki Desk | 7 Sept 2020 3:20 PM ISTదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే , ఈ నేపథ్యంలో కేంద్రం అన్‌లాక్ 4 మార్గదర్శకాల్ని ఈ మద్యే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ప్రతిరోజూ కూడా 10 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్ 4 మార్గదర్శకాల్ని అనుసరించి ఏపీలో అన్ లాక్ 4 గైడ్ లైన్స్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు మూసేఉంటాయి. అయితే , 9, 10 తరగతి విద్యార్థులు మాత్రం స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే , సెప్టెంబర్ 21 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చు. సెప్టెంబర్ 21 నుంచి కాలేజీలకు వెళ్లేందుకు ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు ఒప్పుకుంటున్నట్లు తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.
సెప్టెంబర్ 21 నుండి వంద మందికి మించకుండా , విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, పెళ్లిళ్లకు 50 మంది వెళ్లచ్చు అని , అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదని తెలిపింది. సెప్టెంబర్ 30 వరకూ ఏపీలోని సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. ఇకపోతే , ఏపీలో కొత్తగా 10,794 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా ఒక్క రోజులో 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 70 మంది మరణించారు. ఇప్పటి వరకు 4,417 మంది మృతి చెందారు. ఏపీ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. కరోనాతో పోరాడి అందులో 3,94,019 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 99,689 యాక్టివ్ కేసులున్నాయి.