Begin typing your search above and press return to search.
గవర్నర్ వద్దకు నిమ్మగడ్డ.. ఏం జరగనుంది?
By: Tupaki Desk | 18 July 2020 12:00 PM ISTఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం కోసం ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదం అనూహ్యమైన మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు ఏపీ ప్రభుత్వంతో పోరాడిన ఆయన చివరకు హైకోర్టులో నిన్నటి విచారణలో నెగ్గారు. ఏపీ గవర్నర్ హరిచందన్ వద్దకు వెళ్లి ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం కావాలని హైకోర్టు సూచించింది. గవర్నర్ కు సైతం నిమ్మగడ్డను అపాయింట్ మెంట్ చేయాలని కోరింది.
ఈ క్రమంలోనే నిమ్మగడ్డకు తాజాగా ఏపీ గవర్నర్ అపాయింట్ మెంట్ దొరికింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు గవర్నర్ హరిచందన్ అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ కు నిమ్మగడ్డ వినతిపత్రం ఇవ్వనున్నారు.
నిన్న నిమ్మగడ్డ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. తనను ఎస్ఈసీగా జగన్ ప్రభుత్వం నియమించడం లేదని.. హైకోర్టు ఆదేశించినా అమలు చేయడం లేదని నిమ్మగడ్డ హైకోర్టుకు విన్నవించారు. దీంతో నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్మగడ్డను గవర్నర్ ను కలవాలని కోరింది. హైకోర్టు తీర్పు అమలు చేయాలని గవర్నర్ ను కోరింది. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.