Begin typing your search above and press return to search.
సంక్షేమం లో జగన్ జోరు.. మరో పథకం ప్రారంభం
By: Tupaki Desk | 1 Feb 2020 1:55 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్య రాజకీయ, పాలన నిర్ణయాలు తీసుకుంటూనే సంక్షేమ బాట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రాజధాని మార్పు, శాసనమండలి రద్దు తదితర నిర్ణయాలతో దూకుడుగా ఉన్న వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా తన పంథాలో ముందుకు వెళ్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా మరో కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న చేదోడు అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాదికి ఆయా వర్గాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు ఈ పథకం అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభించనున్నారు.
గతంలో ఆటో డ్రైవర్లకు ఇదే మాదిరి పథకం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే కదా. ఆ పథకంపై అందరి ప్రశంసలు పొందడం తో తాజాగా దాని మాదిరే జగనన్న చేదోడు పథకం ప్రవేశ పెట్టారు. బీసీలో వెనకబడిన పలు కులాల అభివృద్ధి కి ఈ పథకం దోహదం చేయనుంది.