Begin typing your search above and press return to search.

వెబ్ సైట్ ఓనర్ వైజాగ్ లో స్థలం అడిగితే ‘నో’ చెప్పిన 'ఏపీ సర్కార్'!

By:  Tupaki Desk   |   7 Sept 2020 5:00 PM IST
వెబ్ సైట్ ఓనర్ వైజాగ్ లో స్థలం అడిగితే ‘నో’ చెప్పిన ఏపీ సర్కార్!
X
బెంగళూరు నుంచి నడిపించే ఒక ప్రముఖ వెబ్ సైట్ విశాఖపట్నంలో ఉచితంగా స్థలం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోందట.. దాని ప్రకారం.. వైజాగ్ కు మా వెబ్ సైట్ ఆఫీస్ మార్చుకుంటామని.. మీరు స్థలం ఉచితంగా ఇస్తే ఆఫీసు కట్టుకొని ఉద్యోగాలు కల్పిస్తాం అని ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారని టాక్. దీంతో స్పందించిన ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారంట.. సమర్పించిన వెబ్ సైట్ వాళ్లు స్థలం దక్కుతుందని బోలెడు ఆశలు పెంచుకున్నారు. అయితే ఏపీఐఐసీ వాళ్లకు ఈ ఫైల్ చేరినా ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని ప్రభుత్వ సోషల్ మీడియా టీంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే వైసీపీ ప్రభుత్వంకు దగ్గరగా ఉండే ఆ వెబ్ సైట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరకు వెబ్ సైట్ ఓనర్.. ఏపీ డిజిటల్ మీడియా డిపార్ట్ మెంట్ లో పెద్ద పొజిషన్ లో ఉన్న ఇంకొక వెబ్ సైట్ ఓనర్ ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున స్థలం దక్కించుకోవాలని గట్టిగానే ప్రయత్నించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సోషల్ మీడియా టీం వర్గాల్లో ఇదే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అయితే ప్రభుత్వం నుంచి పెద్దగా పాజిటివ్ స్పందనలు రాలేదంట.. బెంగళూరు నుంచి నడిపించే ఈ ఓనర్ ఈ మధ్య అమరావతి సచివాలయంలో బాగా కనిపిస్తున్నాడని కూడా అంటున్నారు. జగన్ ఆ విషయంలో పార్టీలకు సంబంధం లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం.. పర్ ఫెక్ట్ డీపీఆర్ లేకుండా ఎవరికి స్థలం ఇవ్వకుండా.. ఉద్యోగాలు ఇవ్వకుండా స్థలం దక్కించుకునే వారు ఎవ్వరైనా సరే ఇవ్వవద్దు అని జగన్ ఆదేశాలు ఇచ్చారంట.. అందుకే వెబ్ సైట్ కు స్థలం ఇవ్వడం లేదని అనుకుంటున్నారు . బెంగళూరు నుంచి నడిపించే ఆ ఓనర్ ఈ మధ్య సచివాలయంలోకి వెళ్లి లాబీయింగ్ చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదని నిరుత్సాహ పడినట్టు టాక్ నడుస్తోంది. దీంతో ఉసూరుమంటూ ఆ వెబ్ సైట్ ఓనర్ తిరుగుపయనమయ్యాడని మీడియా సర్కిల్ లో చర్చ జరుగుతోంది.