Begin typing your search above and press return to search.

రైతు భరోసా ఇకపై వైఎస్సార్ రైతు భరోసా !

By:  Tupaki Desk   |   6 July 2020 3:40 PM IST
రైతు భరోసా ఇకపై వైఎస్సార్ రైతు భరోసా !
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాల పేరులో మార్పులు చోటుచేసుకో బోతున్నాయి. ఈ కేంద్రాలను దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పేరును పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇకపై రైతు భరోసా కేంద్రాలు ‘డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా మారనున్నాయి. రైతులకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తు గా అయన పేరును ఖరారు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భం గా మే 30న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే వైఎస్సార్‌ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవం గా ప్రకటిస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వైఎస్సార్‌ పేరు కలిసేలా ఇప్పటికే పలు పథకాలను జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.