Begin typing your search above and press return to search.

కరోనా పై ఏపీ ప్రభుత్వ తాజా మెడికల్ బులిటెన్ విడుదల...ఏముందంటే ?

By:  Tupaki Desk   |   9 March 2020 10:01 AM GMT
కరోనా పై ఏపీ ప్రభుత్వ తాజా మెడికల్ బులిటెన్ విడుదల...ఏముందంటే ?
X
కరోనా వైరస్ ప్రభావం భారత్ లో రోజురోజుకి పెరిగిపోవడం తో , దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. ఇందులో భాగంగానే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం , రాష్ట్రంలో కరోనా లేనప్పటికీ, ఎప్పటికప్పుడు తాజా బులిటెన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన లేటెస్ట్ బులిటెన్‌ ...ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం... 102 దేశాలకు కరోనా వైరస్ సోకింది. కరోనాతో రిస్క్... హై లెవెల్‌కి చేరినట్లు WHO ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా సోకిన దేశాల నుంచీ వచ్చి... డాక్టర్ల పర్యవేక్షణలో 441 మంది ప్రయాణికులు ఉన్నారు అని తెలిపింది.

అలాగే... 206 మందిని ఇళ్లలోనే ఉండమని అధికారులు ఆదేశించారు. మరో 225 మందిని గత 28 రోజులుగా ఇళ్లలోనే ఉంచి అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఆస్పత్రుల్లో చేరిన 10 మంది పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పటివరకూ 34 మంది శాంపిల్స్ కలెక్ట్ చేసి... పరీక్షించారు. 29 మందికి నెగెటివ్ అని వచ్చింది. మరో 5 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది అని తెలిపింది.

ఈ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 24 గంటలు , వారం అంతా పనిచేసే కంట్రోల్ రూంని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది అన్ని జిల్లాల్లో పనిచేస్తోంది. ఎవరికైనా కరోనాపై డౌట్లు ఉంటే... 0866-2410978 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కరోనాకి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేశారు. ఆరోగ్య సలహాలు, సూచనలు పొందాలనుకునేవారు 104 హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో MRP కంటే ఎక్కువ రేటుకు మాస్కులు అమ్ముతున్న 9 మెడికల్ షాపుల లైసెన్సుల ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఏ మెడికల్ షాపు రూల్స్ అతిక్రమించినా... చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం తెలిపింది.